Published
Thu, Sep 15 2016 10:26 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
డిండికి చేరిన సైకిల్‌యాత్ర
డిండి : కర్నాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా– భీమానది సంగం నుంచి ప్రారంభించిన సైకిల్‌యాత్ర గురువారం డిండి మండల కేంద్రానికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతి కోసమే కృష్ణా నదమ్మ సైకిల్‌యాత్ర సుమారు 3,500 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మిక అధ్యయన పర్యావరణ పరిరక్షణ వేత్త పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని ధర్మపరిరక్షణకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని కోరారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాలను సందర్శిస్తూ దేవాలయాలను దర్శిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ యాత్ర సాగుతున్నట్లు ఆయన తెలిపారు.