
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment