Published
Fri, Aug 19 2016 10:43 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్(ఎస్) : హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కస్తూరిబా, ఎస్సీ హాస్టల్, ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ హాస్టల్‌లో ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్లు పందులు, తేళ్లు, పాములు వస్తున్నాయన్నారు. విద్యార్ధులు నడచి వెళ్లడానికి దారికూడా సక్రమంగా లేదన్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రహరీలేక బాలికలకు రక్షణలేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జుజ్జూరి సతీష్, ఏర్పుల సతీష్, ఉప్పుల సైదులు, సురేష్, రమేష్,ప్రవీణ్, ఉపేందర్, వేణు, అప్పిరెడ్డి, నాగరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.