మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన డోర్ సెల క్షన్ వివాదాస్పదంగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. సీట్లు పెంచాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకు లు ఘర్షణ పడగా ఐదుగురికి గాయాల య్యాయి. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళి తే.. ఈ కళాశాలలో మూడు లిస్టుల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు శుక్రవారం ఉదయం డోర్ సెలక్షన్ నిర్వహిం చారు.
అయితే సీట్లు పెంచాలంటూ ఏబీవీపీ నాయకులు ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు కళాశాల గేటు బయట ధర్నా నిర్వహించారు. విషయాన్ని ఫోన్‌లో పీయూ రిజిస్ట్రార్ కె.వెంకటాచలం దృష్టికి తీసుకెళ్లగా 40శాతం సీట్లు పెంచుతామని హామీ ఇవ్వడంతో ఏబీవీపీ నాయకులు ఆందోళన విరమించారు. బయటకు వచ్చి గేటు వద్ద ధర్నా చేస్తున్న నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలు దూషించుకుని దాడికి పాల్పడగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి రాము, అధ్యక్షుడు మధు, పీడీఎస్‌యూ నాయకులు బోయిన్‌పల్లి రాము, వెంకట్; ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం నాగరాజుకు గాయాలయ్యా యి.
వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలం టూ ఇరువర్గాలవారు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై దాడికి నిరసనగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాలలో నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనకారులను బయటకు పం పించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం యథాతథంగా డోర్ సెలక్షన్ నిర్వహించగా 200 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఎస్.ఎ.రషీద్ తెలిపారు.
డోర్ సెలక్షన్‌పై వివాదం
Published Sat, Jul 19 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement
Advertisement