22 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు | 22 onwards sfi dist meeting | Sakshi
Sakshi News home page

22 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

Published Wed, Oct 19 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

22 onwards sfi dist meeting

ఏలూరు సిటీ : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 39వ జిల్లా మహాసభలను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు నగర కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. మంగళవారం స్థానిక  సంఘ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య కార్యకర్తల సమావేశం ఉపాధ్యక్షుడు సీహెచ్‌ భరత్‌ అధ్యక్షతన  నిర్వహించారు. భీమవరం కిరాణా మర్చంట్స్‌ హాల్‌లో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని, జిల్లా నలుమూలల నుంచి దాదాపు 350 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని కార్యదర్శి క్రాంతిబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు విద్యార్థి లోకం నాంది పలికేలా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement