30న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 30వ తేదీన ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌ను పాటించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమన్యాలు సహకరించాలని కోరారు. శుక్రవారం కార్మిక, కర్షక భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కమిటీ ఉపాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ..కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను పెట్టడంలేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి నిరసనగా బంద్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, శంకర్, ఆర్.శంకర్, అక్బర్, వీరేంద్ర, చంద్ర, ప్రకాష్, వెంకటేశ్, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు.