విద్యారంగానికి ప్రభుత్వం తక్కువగా నిధులు కేటాయించిందంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.
విద్యారంగానికి ప్రభుత్వం తక్కువగా నిధులు కేటాయించిందంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా ఉన్నప్పటికీ, విద్యారంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. విద్యారంగం అభివృద్ధికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.