మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం
నెల్లూరు (టౌన్) : నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థినుల మృతికి నిరసనగా బుధవారం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. గాంధీబొమ్మ సెంటరు నుంచి వీఆర్ కళాశాల వరకు ప్రదర్శన చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసే విషయంలో కొద్దిసేపు పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్‌చేసి 4వ పట్టణపోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ విద్యార్థినుల మృతికి బాధ్యతగా నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయుకులు ప్రసాద్, నందకిరణ్, రాము, నవీన్, రవీంద్ర, తరుణ్, క్రాంతి, విజయ్, ఆఫ్రోజ్, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.
నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
ఇద్దరు విద్యార్థినుల మృతికి కారకులై న నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ముత్తుకూరు బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు మృతి చెందారని తెలిపారు. కేవలం మంత్రి పదవి ఉందన్న కారణంగా అనుమతులు లేకుండానే నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నారు. నగర హాస్టల్స్ ఇన్‌చార్జి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నీరదారెడ్డి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఏబీవీపీ నాయకులు నవీన్, నరేష్, బాలకృష్ణ, రాజు, శ్రీకాంత్, సతీష్, మాధవ్, కౌషిక్ తదితరులు పాల్గొన్నారు.