ఫీజులు నియంత్రించాలి
Published Fri, Jul 22 2016 1:05 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM
గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం వారిపట్ల ఉ దాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు. ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అం జి, నాగరాజు, రాకేష్, రవి, గోపాల్, రాజు, రాము, ఆనం ద్, తాయన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement