
‘ఫాస్ట్’ను రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నల్లగొండ అర్బన్ : తెలంగాణ విద్యార్థులకు మా త్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్’ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యద ర్శి కె.రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక డీకే భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. 1956 నిబంధనల వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టమని, జీఓనంబర్36ను వ్యతిరేకించామని గుర్తుచేశారు.
6 సూత్రాల పథకానికి రాష్ట్ర పతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమన్నారు. జిల్లాలో 120 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలున్నాయన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు నష్టాల్లో కూరుకుపోయాయని అన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.విద్యాసాగర్, ఎం.మహేశ్, డి. వెంకటాద్రి, కె.అశోక్‌రెడ్డి, బాలు, చిన్నా, శేఖర్ ఉన్నారు.