
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర
కోదాడఅర్బన్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమరభేరి సైకిల్ యాత్రలు మంగళవారం కోదాడ పట్టణంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఈ సైకిల్‌యాత్రను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు జుట్టుకొండ బసవయ్య , ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల విద్యాసాగర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 134 వసతి గృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, వాటిలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలపై తమ సైకిల్‌యాత్రలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనాకుల శ్రీకాంత్, వర్మ, మట్టపల్లి వెంకట్, పల్లపు శ్రీనివాస్, ఉపేందర్, మహేందర్, ప్రవీణ్, నవీన్, సతీష్, మహేష్, ఎస్.రాధాకృష్ణ, ఎం. ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.