జైపూర్: తనకు దక్కలేదన్న కోపంలో వివాహితను ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జలోర్ జిల్లాకు చెందిన శాంతిదేవి అనే యువతికి గణేశ్‌రామ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేగాక యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తికి ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు. ప్రస్తుతం మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు.
చదవండి: మాయమాటలు చెప్పి.. శారీరకంగా లొంగదీసుకొని.. గర్భవతిని చేసి
అయితే యువతికి పెళ్లైన తరువాత కూడా ఆమెతో సంబంధం పెట్టుకోవాలని ప్రియుడు కోరాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో వివాహితపై కోపం పెంచుకున్న అతడు శాంతిదేవి ఎక్కడుంటుందో విషయం తెలుసుకున్న ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లాడు. పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని హత్తుకొని అక్కడే ఉండిపోయాడు.
చదవండి: మీ ఇల్లు నచ్చింది.. అద్దెకు ఉంటానంటూ ఫోన్ పే లింకు పంపి..
అహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన్వాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని మృతదేహం నుంచి వేరు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment