ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ సెయిలర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్-2015 బ్యాచ్) పోస్టుల భర్తీకి అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 01 ఫిబ్రవరి 1994 - 31 జనవరి 1998 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, మెడికల్ టెస్టుల ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 8
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) వివిధ విభాగాల్లో 496 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు:
ఏఎస్‌ఐ(ఆర్‌ఎమ్)-68
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)-417
హెడ్ కానిస్టేబుల్ (ఫిట్టర్)-11
అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ)/ తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషులు కనీసం 168 సెం.మీ. ఎత్తు, 80 సెం.మీ. ఛాతీ కలిగి ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాతపరీక్ష తేది: ఆగస్టు 24
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూలై 7
వెబ్‌సైట్: www.bsf.nic.in
ఉద్యోగాలు
Published Tue, May 27 2014 9:46 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement