ఇండియన్ నేవీలో.. పర్మినెంట్ కమిషన్‌డ ఆఫీసర్
ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోని నావల్ ఆర్న్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ కేడర్ (ఎన్‌ఏఐసీ), ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లలోని ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి పర్మినెంట్ కమిషన్డ్ హోదా ఇస్తారు.నావల్ ఆర్‌నమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్‌అర్హత: 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్) లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్)వయసు: 19 1/2 -25 ఏళ్లు ( 1990, జూలై 2-1996, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి)
ఎడ్యుకేషన్ ఆఫీసర్
అర్హత: 50 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్-బీఎస్సీలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి)/ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్-బీఎస్సీలో ఫిజిక్స్ చదివి ఉండాలి)/ఎంఏ (ఇంగ్లిష్/హిస్టరీ)/ఎంఎస్సీ (కెమిస్ట్రీ)/ఎంసీఏ (గ్రాడ్యుయేషన్‌లో ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంటెక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)వయసు: 21-25 ఏళ్లు (1990, జూలై 2-1994, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి)శారీరక ప్రమాణాలు: ఎత్తు 157 సెం.మీ. ఎత్తుకు తగిన బరువు, చక్కటి కంటి చూపు ఉండాలి.
విధులు
ఎన్‌ఏఐసీ ఆఫీసర్:
వివిధ సంస్థలు నేవీకి సరఫరా చేసిన ఆర్న్‌మెంట్స్‌కు సంబంధించిన పూర్తి బాధ్యత నావల్ ఆర్న్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్‌దే. నావల్ ఆర్నమెంట్స్ నాణ్యత, సంరక్షణ, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించడంతోపాటు ఆయా అంశాల్లో కావల్సిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. మరొక విభాగంలో ఆర్న్‌మెంట్స్‌కు సంబంధించి చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను పర్యవేక్షించాలి. తదనుగుణంగా సదరు విభాగంలో వాటిని అమలు చేయడం వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎడ్యుకేషన్ ఆఫీసర్:
ట్రైనింగ్ షిప్స్, ఎస్టాబ్లిష్‌మెంట్ విద్య వ్యవహారాలను ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తాడు. ఇందులో మెటలర్జీ అండ్ ఓషియానోగ్రఫి/నావల్ కమ్యూనికేషన్స్/యాంటీ సబ్‌మెరైన్, వార్‌ఫేర్/గన్నరీ/నావిగేషన్ అండ్ డెరైక్షన్/హైడ్రోగ్రఫి/ఐటీ/ఎంటెక్ కోర్సులు ఉంటాయి. అంతేకాకుండా స్కూలింగ్/లైబ్రరీస్/ అకడమిక్/డిస్టెన్స్ ఎడ్యుకేషన్/నావల్ ఎగ్జామినేషన్ వంటి అంశాలను సమన్వయం చేసుకోవాలి. సంబంధిత మానవ వనరులకు కావల్సిన శిక్షణ, డిజైన్, మూల్యాంకనం వంటి వ్యవహారాలను ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తాడు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి నిర్వహించే సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అర్హత కంటే ఎక్కువ డిగ్రీ, మంచి శాతంతో ఉత్తీర్ణతో సాధించి ఉంటే.. ఆ డిగ్రీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/ కొయంబత్తూరు/విశాఖపట్నంలలో డిసెంబర్ 14, 15లలో నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 24, 2014.
ప్రింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
నవంబర్ 4, 2014.చిరునామా: పోస్ట్ బాక్స్ నెంబర్-4,
ఆర్‌కేపురం మెయిన్ పోస్టాఫీస్, న్యూఢిల్లీ-110066.
వివరాలకు: www.nausenabharti.nic.in
శిక్షణ-కెరీర్
ఎంపికైన అభ్యర్థుల కెరీర్ సబ్-లెఫ్టినెంట్‌గా ప్రారంభమవుతుంది. వీరికి ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమాలా (కేరళ)లో నేవల్ ఓరియెంటేషన్‌లో శిక్షణనిస్తారు. తర్వాత వివిధ నావల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో వృత్తిపరమైన శిక్షణనిస్తారు. ఈ సయమంలో వీరు ప్రొబేషనరీలో కొనసాగుతారు. కెరీర్ పరంగా ఉండే పదోన్నతులు, వేతనాలను పరిశీలిస్తే..
ర్యాంక్ పేబాండ్ గ్రేడ్‌పే ఎంఎస్‌పీ
సబ్ లెఫ్టినెంట్ పీబీ-3/రూ. 15,600-39,100 రూ. 5,400 రూ. 6,000
లెఫ్టినెంట్ పీబీ-3/రూ. 15,600-39,100 రూ.6,100 రూ. 6,000
లెఫ్టినెంట్ సీడీఆర్ పీబీ-3/రూ. 15,600-39,100 రూ. 6,600 రూ. 6,000
కమాండర్ పీబీ-4/రూ. 37,400-67,000 రూ. 8,000 రూ. 6,000
కెప్టెన్ పీబీ-4/రూ. 37,400-67,000 రూ. 8,700 రూ. 6,000
కమాండర్ పీబీ-4/రూ. 37,400-67,000 రూ. 8,900 రూ. 6,000
రీయర్ అడ్మిరల్ పీబీ-4/రూ. 37,400-67,000 రూ. 10,000 రూ. 6,000
వైస్ అడ్మిరల్ పీబీ-4/రూ. 37,400-67,000 - -
వీటికి తోడు వివిధ అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
ఎస్‌ఎస్‌బీ ఇలా
సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ప్రక్రియను ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. అవి.. స్టేజ్-1, స్టేజ్-2: స్టేజ్-1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ టెస్ట్, డిస్కషన్ టెస్ట్ వంటి పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు స్టేజ్-2 పరీక్షలకు హాజరు కావాలి. ఇందు లో సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, తదితర పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు ప్రధానంగా అభ్యర్థుల విశ్లేషణాత్మక సామర్థ్యం, మానసిక దృఢత్వం, తార్కిక వివేచన, పరిశీలనా సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. వివరాలు..
మొదటి రోజు నిర్వహించే పరీక్షలు:
ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ (ఓఐఆర్‌టీ): ఇందులో కంప్లీషన్ ఆఫ్ సిరీస్, కోడింగ్-డికోడింగ్, రిలేషన్‌షిప్, జంబుల్డ్ స్పెల్లింగ్, బెస్ట్ రీజన్, సేమ్ క్లాస్ టెస్ట్, డెరైక్షన్స్, కామన్‌సెన్స్, సీక్వెన్సెస్, వర్డ్ బిల్డింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ (పీడీపీటీ): ఇందులో 30 సెకన్ల పాటు ఒక చిత్రం (పిక్చర్) ఫ్లాష్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి.. క్యారెక్టర్స్ (ఛిజ్చిట్చఛ్ట్ఛిటట), వయసు (్చజ్ఛ), లింగం (ట్ఛ్ఠ), మూడ్ (ఝౌౌఛీ), యాక్షన్ రిలేటింగ్ టు పాస్ట్ (action relating to past), ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ (present and future for each character) వంటి వివరాలను నిమిషం వ్యవధిలో నమోదు చేసుకోవాలి. తర్వాత వీటి ఆధారంగా నాలుగు నిమిషాల్లో కథను రాయాలి.డిస్కషన్ ఆఫ్ ది పిక్చర్ ఇన్ 30 మినిట్స్: ఈ విభాగానికి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులను గ్రూపులుగా విభజిస్తారు. ప్రతిగ్రూప్‌లో 15 మంది ఉంటారు. ప్రతి సభ్యుడు తాను రాసిన కథను వినిపించాలి. ఈ విధంగా సభ్యులందరూ చర్చించుకుని ఆ కథ నేపథ్యం, పాత్రల మీద ముగింపునకు రావాలి. ఈ దశలో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు.రెండో రోజు నుంచి సైకలాజికల్ టెస్ట్‌లు ప్రారంభమవుతాయి.
ఇందులో ఉండే విభాగాలు..
థిమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్: ఇందులో 12 చిత్రాలను వరుసగా చూపిస్తారు. వీటిల్లో ఒక్కోటి 30 సెకన్లపాటు ఫ్లాష్ అవుతుంది. వీటి ఆధారంగా 4 నిమిషాల్లో ఒక కథను రాయాలి. అయితే ఈ క్రమంలో 12 చిత్రాల్లో ఏదో ఒక చిత్రాన్ని ఖాళీ(బ్లాంక్)గా ఉంచుతారు. ఈ ఖాళీ చిత్రంలో.. ఉండాల్సిన చిత్రాన్ని ఊహించి.. దాని ఆధారంగా కథను రూపొందించాలి. వర్డ్ అసోసియేషన్ టెస్ట్: ఇందులో ఒక దాని తర్వాత ఒకటి చొప్పున 60 పదాలను చూపిస్తారు. అభ్యర్థులు వాటి ఆధారంగా తమకు వచ్చిన ఆలోచన/కథను రాయాలి. సిచ్యువేషన్ రియాక్షన్ టె్‌స్ట్: ఇందులో దైనందిన జీవితంలో ఎదురయ్యే 60 సంఘటనలను పొందుపరుస్తూ ఒక బుక్‌లెట్‌ను అభ్యర్థులకు అందజేస్తారు. అభ్యర్థులు వాటి పట్ల తమ ప్రతిస్పందనలను బుక్‌లెట్‌లో నిర్దేశించిన ప్రదేశంలో రాయాలి. సెల్ఫ్ డిస్‌క్రిప్షన్ టెస్ట్‌లో తల్లిదండ్రులు/సంరక్షకులు, స్నేహితులు, ఉపాధ్యాయులు/ పర్యవేక్షకులకు సంబంధించి వేర్వేరుగా ఐదు వ్యాసాలను 15 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది.
మూడో రోజు నిర్వహించే పరీక్షలు..
గ్రూప్ డిస్కషన్: ఇందులో సామకాలీన అంశం లేదా సాంఘిక/సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంపై ఇష్టాగోష్టిగా చర్చించాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చకు అర్థ్ధవంతమైన ముగింపు ఉండనవసరం లేదు. గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్‌సైజ్ (జీపీఈ): ఇందులో ఐదు దశలు ఉంటాయి. అవి.. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది మోడల్, రీడింగ్ ఆఫ్ ది నారేటివ్ బై జీటీవో, సెల్ఫ్ రీడింగ్ (5 నిమిషాలు), ఇండివీడ్యువల్ రిటెన్ సొల్యూషన్స్ (10 నిమిషాలు), గ్రూప్ డిస్కషన్ (20 నిమిషాలు). ఈ విభాగానికి సంబంధించిన చర్చకు అర్థవంతమైన ముగింపు తప్పనిసరి.ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్(పీజీటీ): ఈ పరీక్షను అవుట్‌డోర్‌లో నిర్వహిస్తారు. ఇందులో క్రమక్రమంగా పెరుగుతున్న క్లిష్టతను అధిగమించి అడ్డంకులను 40 నుంచి 50 నిమిషాల్లో పూరించాలి.
గ్రూప్ ఆబ్‌స్టకెల్ రేస్(జోవోఆర్)లో నిర్దేశించిన విధంగా గ్రూప్‌ల వారీగా అడ్డంకులను దాటాలి.హాఫ్‌గ్రూప్ టాస్క్ దశ (హెచ్‌జీటీ): ఇందులో సభ్యులను సబ్‌గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక గ్రూప్ అడ్డంకులను పూరిస్తుంటే మరో గ్రూప్ ఆటంకం కలిగిస్తూంటుంది. ఇందులో ప్రతి సబ్ గ్రూప్‌నకు 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. లెక్చరేట్: ఇందులో అభ్యర్థులు గ్రూప్‌ను ఉద్దేశించి నాలుగు నిమిషాలపాటు చిన్న ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అంశాన్ని ఎంపిక చేసుకోవడానికి, ప్రిపేర్ కావడానికి మూడు నిమిషాల సమయం ఇస్తారు.
నాలుగో రోజు ఉండే పరీక్షలు..
ఇండివీడ్యువల్ ఆబ్‌స్టకెల్: ఇందులో ఒకటి నుంచి పది సంఖ్యలతో కూడిన అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకిని అధిగమించాలి. ఒక్కో అడ్డంకికి ఒక్కో విధంగా మార్కులు కేటాయిస్తారు. ఇందుకు మూడు నిమిషాల సమయం కేటాయిస్తారు.
కమాండ్ టా్‌స్క్: ఇందులో ఒక్కొక్కరు ఒక గ్రూప్‌నకు కమాండర్‌గా వ్యవహరించాలి. ఇందులో ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగా 15 నిమిషాల్లో అడ్డంకిని అధిగమించాలి.ఫైనల్ గ్రూప్ టాస్క్: ఇందులో కూడా ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగా ఉండే అడ్డంకిని 15-20నిమిషాల్లో పూర్తి చేయాలి.
ఐదో రోజు:
ఐదో రోజు క్లోజింగ్ అడ్రస్ బై డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్, కాన్ఫరెన్స్, ఫలితాల వెల్లడి వంటి అంశాలు ఉంటాయి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ దశను విజయవంతంగా పూర్తి చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి నియామకం ఖరారు చేస్తారు.