ఛత్తీస్గఢ్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి | Maoists kill three BSF troopers in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

Published Tue, Nov 12 2013 2:30 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

Maoists kill three BSF troopers in Chhattisgarh

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. బస్తర్ ప్రాంతంలోని సుకుమా జిల్లాలోని కేర్లపాల్ సమీపంలోని కల్వర్ట్ను మంగళవారం మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఆ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

 

అతడిని రాయ్పూర్ తరలించినట్లు చెప్పారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రత సిబ్బంది సంయూక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్లో మొదటి దఫా ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో విధులు ముగించుకుని వెళ్తున్న భద్రత దళాలకు చెందిన జవాన్లనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.

 

మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని ఊపిరి పీల్చుకుంటున్న అధికారులకు ఈ సంఘటనతో మళ్లీ తలనెప్పి మొదలైంది. రాష్ట్రంలో రెండవ మలి దశ ఎన్నికలు నవంబర్ 19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement