ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సూచించారు.
సఖ్యతతో వ్యవహరించి సమస్యలను సర్దుబాటు చేసుకోవాలన్నారు. పద్ధతి ప్రకారం కేంద్రం నుంచి అందాల్సిన సహకారం రెండు రాష్ట్రాలకు అందుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మిగతా రాజకీయ విషయాలను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.