సభ్యులు దిగజారి ప్రవర్తిస్తున్నారు: వెంకయ్య
న్యూఢిల్లీ : చట్ట సభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని, సభ్యులు దిగజారుడులా ప్రవర్తిస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన శుక్రవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని వెంకయ్య నాయుడు మరోసారి స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలలో దేనిపైనా తనకు సవతితల్లి ప్రేమ లేదని, ఇరు రాష్ట్రాలు సమానమేనని ఆయన అన్నారు. అంతకు ముందు టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోరాటలపై ఉద్యమబాట పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వీ హనుమంతరావు, జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.