సీఎంలిద్దరూ అహంభావం వీడాలి: శ్రీకాంత్రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ అహంభావం వీడి.. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి మాట్లాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని, అక్కడి టీడీపీ నాయకులు స్వప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ లాభాల కోసమే చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు.