'రైతుల పట్ల ప్రభుత్వాలు ఔదార్యంగా వ్యవహరించాలి' | goverments should give ex gratia for farmers, ysrcp | Sakshi
Sakshi News home page

'రైతుల పట్ల ప్రభుత్వాలు ఔదార్యంగా వ్యవహరించాలి'

Published Mon, Apr 13 2015 3:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

goverments should give ex gratia for farmers, ysrcp

హైదరాబాద్: అకాల వర్షంతో తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని  వైఎస్సార్ సీపీ విజ్ఞప్తి చేసింది. రైతుల పట్ల ప్రభుత్వాలు ఔదార్యంగా వ్యవహరించి వారిని ఆదుకోవాలని వాసిరెడ్డి పద్మ, కొండా రాఘవరెడ్డిలు ప్రభుత్వాలను కోరారు. వర్షాలతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని.. ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఏపీలో రుణమాఫీ అమలు కాక రైతులు కుదేలైన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణం రైతులను ఆదుకోవాలన్నారు. వర్షాల వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement