
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో సీఎంలతో మోదీ మూడో వీడియో కాన్ఫరెన్స్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లతో ప్రధాని ఈ నెల 24వ తేదీన వీడియో లింక్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామిత్వ పథకాన్ని ప్రారంభించడంతోపాటు ఈ–గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నారని అధికార వర్గాలు వెల్ల డించాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని గ్రామీణ ప్రాంతాల్లోని నివాస ప్రాంతా న్ని గుర్తించడమే స్వామిత్వ పథకం ఉద్దేశం.
ప్రధాని మోదీకి బిల్‌గేట్స్ ప్రశంసలు
దేశంలో కరోనాæ వ్యాప్తిని అడ్డుకు నేందుకు లాక్‌డౌన్ విధించడంతో పాటు పరీక్షలు విస్తృతంగా చేపట్టడం వంటి చర్యలను అమలు చేస్తున్న మోదీపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్తూ ఆయన ప్రధానికి లేఖ రాశారని అధికార వర్గాలు తెలిపాయి.