న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకొని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నారు. ఆయన మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. బుధవారం మరో 15 రాష్ట్రాల సీఎంలు, అధికారులతో చర్చిస్తారు. ప్రధాని మోదీ ఇప్పటి దాకా ముఖ్యమంత్రులతో ఐదుసార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా మే 11న ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment