మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతను నీతి ఆయోగ్ తొలి సమావేశం ఆదివారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. పెట్టుబడులు, పొదుపు, అభివృద్ధి తదితర అంశాలపై ఈ సందర్బంగా చర్చిస్తున్నారు. అలాగే ఈ ఫిబ్రవరి 28న కేంద్ర ప్రవేశ పెట్టనున్న ఆర్థిక బడ్జెట్ లో తీసుకురావాల్సిన అంశాలపై కూడా ప్రధాని ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (భారత జాతీయ పరివర్తన సంస్థ)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.