కేంద్ర నిర్ణయాన్ని సీఎంలు సమర్థించారు: జైట్లీ | Chief ministers supports to Central government decisions | Sakshi
Sakshi News home page

కేంద్ర నిర్ణయాన్ని సీఎంలు సమర్థించారు: జైట్లీ

Published Sun, Dec 7 2014 5:46 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

కేంద్ర నిర్ణయాన్ని సీఎంలు సమర్థించారు: జైట్లీ - Sakshi

కేంద్ర నిర్ణయాన్ని సీఎంలు సమర్థించారు: జైట్లీ

న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘానికి బదులుగా నూతన సంస్థ స్థాపన కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆదివారం న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులతో మోడీ తన నివాసంలో సమావేశమైయ్యారు. ఆ సమావేశం వివరాలను జైట్లీ మీడియాకు వెల్లడించారు. మొదటి బృందంలో ప్రధాని, ముఖ్యమంత్రులు...  రెండో బృందంలో ప్రధాని, కేంద్ర మంత్రి మండలి... మూడో బృందంలో ప్రధాని, ఉన్నతాధికారులు ఉంటారని తెలిపారు. 1950లో ప్రణాళిక సంఘం
ఏర్పాటైనా...1992 నుంచి దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని జైట్లీ గుర్తు చేశారు.

దేశాభివృద్ధికి మరన్ని ప్రణాళికలు అవసరమని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సీఎంలు సమర్థించారని జైట్లీ చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రులు, అధికారులు కలిస్తేనే టీమిండియా అని జైట్లీ చమత్కరించారు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ సంస్థ ఏర్పాటుపై అన్ని రకాల సలహాలు, సూచనలు అందిన తర్వాతే ముందుకు వెళ్తామన్ని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement