అసోం, మహారాష్ట్ర, హర్యానాల్లో ముఖ్యమంత్రులను మార్చే అవకాశం కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలని యోచిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ దిశగా కీలక నేతలతో వరుస మంతనాలు జరుపుతోంది.
అసోం, మహారాష్ట్ర, హర్యానాల్లో ముఖ్యమంత్రులను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో శనివారం హర్యనా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీనియర్‌నేతలు శివాజీరావ్ దేశ్‌ముఖ్, శివాజీరావ్ మోఘే కూడా సోనియాతో సమావేశమయ్యారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్‌తో సమావేశమై చర్చించారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్పై అసంతృప్తి పెరుగుతున్నట్టు సమాచారం. అసోం సీనియర్‌నేత విశ్వశర్మ అధిష్టానం పెద్దలను కలుసుకోనున్నారు.