
పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి
హైదరాబాద్: శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. మైసూరా రెడ్డి విమర్శించారు. దీనికి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ గొడవలు చూస్తుంటే తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే మాట్లాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన హితవు పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సమస్య పరిష్కారానికి గవర్నర్ వద్దకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఇద్దరు సీఎంలూ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మైసూరా రెడ్డి దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సవాళ్లు, ప్రతి సవాళ్లు మానుకొని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు.