నాగార్జునసాగర్ డ్యాంపై హైడ్రామా
నాగార్జునసాగర్: గత సంవత్సర కాలంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను పర్యవేక్షిస్తూ విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు శనివారం ఉదయం విధుల నుంచి తప్పుకుని వెళ్లిపోయి.. తిరిగి సాయంత్రం విధుల్లో చేరాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2013 నవంబర్ 29న నాగార్జునసాగర్ డ్యాంపై ఆంధ్రా పోలీస్ బలగాలు సగం ప్రాజెక్టును స్వా«దీనంలోకి తీసుకున్నాయి. దీంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాల మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ నుంచి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. సీఆర్‌పీఎఫ్ బలగాలు సాగర్ ప్రాజెక్టును తమ అ«దీనంలోకి తీసుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నాయి. సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు, ఆంధ్రా ప్రాంతంవైపు రెండు పక్కలా సీఆర్‌పీఎఫ్ దళాలు విధులు నిర్వహిస్తూ వచ్చాయి.
అయితే, అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున తెలంగాణ వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు తమ విధులను ఉపసంహరించుకొని హిల్‌కాలనీలోని బాలవిహార్‌లోగల తమ క్యాంపులను ఖాళీ చేసి వెళ్లి పోయాయి. ఆంధ్రా వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు యథావిధిగానే ఉన్నాయి. దీంతో తెలంగాణవైపు ప్రధాన డ్యాంపై స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) బలగాలు డ్యాంను తమ అ«దీనంలోకి తీసుకొని విధులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుజామున వెళ్లిపోయిన సీఆర్‌పీఎఫ్ బలగాలు తిరిగి సాయంత్రానికి సాగర్‌లోని తమ క్యాంపులకు చేరుకొని నాగార్జునసాగర్ డ్యాం భద్రతా విధులలో చేరాయి.
ఆంధ్రా వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు అదేవిధంగా ఉండటంతో.. తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ బలగాలు తిరిగి సాగర్ ప్రాజెక్టు విధి నిర్వహణకు వచి్చనట్లుగా తెలుస్తోంది. సాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఎవరూ దీనిపై సమాధానం చెప్పడం లేదు. సాయంత్రం తిరిగి చార్జ్ తీసుకున్న సీఆర్‌పీఎఫ్ దళాల అసిస్టెంట్ కమాండర్ షహేర్ మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయామని, తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాలతో తెలంగాణ వైపు చార్జి తీసుకున్నట్లుగా తెలిపారు. సరైన ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment