
'ముఖ్యమంత్రుల కొట్లాట నాటకం'
సాగర్ జలాల కోసం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొట్లాట అంతా ఓ నాటకమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సమస్యలపై ప్రజలు నిలదీయకుండా ఉండేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు పోట్లాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఒకవేళ నిజంగానే సాగు నీటి కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొట్టుకుంటుంటే పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.