సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఎన్నికల హోరు జోరందుకుంది. 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరించి హరియాణా విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్ఞానీ గురుముఖ్ సింగ్ ముసాఫిర్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ వరకు 12మంది అధికారపీఠంపై కూర్చున్నారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?)
ముసాఫిర్ కవి, రచయితగా సాహిత్య అకాడమీ అవార్డును అందుకోగా, చరణ్‌జీత్ సింగ్ చన్నీ న్యాయశాస్త్ర పట్టా తీసుకొని, ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పటివరకు సీఎంలు అయినవారిలో ఏడుగురు సాధారణ గ్రాడ్యుయేట్లు కాగా, ముగ్గురు లా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంతేగాక గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేకపోయిన ఇద్దరు సీఎంలు అయ్యారు. (చదవండి: గాడ్ ఫాదర్ లేరు.. అయితేనేం..)
Comments
Please login to add a commentAdd a comment