Qualifications
-
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
వ్యాపార సామ్రాజ్యంలో మహిళా సారధులు - ఏం చదువుకున్నారో తెలుసా?
బిజినెస్ అనగానే సాధారణంగా పురుషులే గుర్తుకు వస్తారు. కానీ వ్యాపార రంగంలో మహిళలు కూడా తమదైన రీతిలో ముందుకు దూసుకెట్లున్నారన్న సంగతి చాలామంది విస్మరించి ఉండవచ్చు. మనం ఈ కథనంలో కోట్ల రూపాయల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ మహిళల గురించి, వారు ఏం చదువుకున్నారు? ఏ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధా మూర్తి (Sudhamurthy) భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శప్రాయమైన 'సుధా మూర్తి' ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ చైర్పర్సన్. ఈమె నారాయణ మూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో పద్మశ్రీ పొందిన ఈమె నికర సంపద విలువ సుమారు రూ. 775 కోట్లు అని సమాచారం. రోష్ని నాడార్ (Roshni Nadar) శివ నాడార్ కుమార్తె 'రోష్ని నాడార్' ప్రస్తుతం హెచ్‌సిఎల్ కంపెనీ సీఈఓ. ఈమె వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ రేడియో/టీవీ/ఫిల్మ్ వంటి వాటి మీద దృష్టి సారించి కమ్యూనికేషన్లో ప్రావీణ్యం సంపాదించింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2022 నాటికి ఆమె నికర సంపద విలువ రూ. 84,330 కోట్లని సమాచారం. నీతా అంబానీ (Nita Ambani) భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ భార్య 'నీతా అంబానీ' ముంబైలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్. 2022 నాటికి ఈమె సంపద విలువ రూ. 84,330 కోట్లు అని తెలుస్తోంది. కిరణ్ మజుందార్-షా (Kiran Mazumdar-Shaw) కిరణ్ మజుందార్-షా బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు & ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కూడా. ఈమె బెంగళూరు ఐఐఎం మాజీ చైర్మన్‌గా కూడా పనిచేసింది. మజుందార్-షా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత బెంగుళూరు యూనివర్శిటీలో జువాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె నికర ఆస్తుల విలువ 18779 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! స్మితా కృష్ణ-గోద్రెజ్ (Smita Crishna-Godrej) నావల్ గోద్రెజ్ కుమార్తె అయిన స్మితా కృష్ణ-గోద్రెజ్ ముంబైలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. ఈమె థియేటర్ యాక్టర్ విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఈమె సంపద విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్! రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani) డాక్టరుగా జీవితం మొదలుపెట్టిన రేష్మా కేవల్రమణి తరువాత కాలంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్‌తో కొత్త శిఖరాలకు అధిరోహించింది. ఈమె అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ సైన్స్‌లో ఏడేళ్ల కోర్సు చేసి ఆ తరువాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి జనరల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. -
..రాహుల్‌ను మించినోళ్లు లేరు: ఖర్గే
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే పూర్తి అర్హతలు దేశం మొత్తమ్మీద రాహుల్ గాంధీకి మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగేలా ఆయనను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్‌దాకా దేశమంతటా పార్టీకి అధ్యక్షుడిగా సమ్మతి సంపాదించే ఏకైక వ్యక్తి రాహులే. ఆయన చరిష్మాతో సరిపోలే వ్యక్తి మరొకరు లేరు. ఇంకెవరైనా ఉన్నారేమో మీరే చెప్పండి’ అన్నారు. ‘‘పార్టీ కోసం, ఆర్ఎస్ఎస్–బీజేపీపై పోరాటం కోసం, దేశ సమైక్యత కోసం అధ్యక్ష పదవికి రాహుల్‌ను ఒప్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ తేదీలను ఆదివారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీలో ఖరారుచేయనున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి ఆ బాధ్యతలను తాత్కాలిక హోదాలో సోనియాగాంధీ నిర్వర్తిస్తున్నారు. తేదీలు ఖరారుకు నేడు సీడబ్ల్యూసీ భేటీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడానికి సీడబ్ల్యూసీ సోమవారం సమావేశం కానుంది. ఆజాద్ రాజీనామా, రాహుల్‌పై ఆయన తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సభ్యులంతా విశ్వాసం ప్రకటించే అవకాశముంది. భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. వైద్య పరీక్షల సోనియా అమెరికా వెళ్లడం తెలిసిందే. రాహుల్, ప్రియాంక కూడా ఆమె వెంట వెళ్లారు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొద్ది వారాలు ఆలస్యమవుతుందని, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి అధ్యక్షుడు పగ్గాలు చేపడతరాని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మొదలు కానుండడంతో అధ్యక్ష ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని ఆ వర్గాలు వివరించాయి. ఆజాద్‌వి తప్పుడు వ్యాఖ్యలు: పైలట్ న్యూఢిల్లీ: సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరస పరాజయాలకు రాహుల్ గాంధీ ఒక్కడినే బాధ్యున్ని చేయడం సరికాదని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అన్నారు. పార్టీని వీడుతూ, రాహుల్‌పై ఈ మేరకు గులాం నబీ ఆజాద్ చేసిన విమర్శలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆజాద్ లేఖను వ్యక్తిగత దూషణాస్త్రంగా అభివర్ణించారు. ‘‘బీజేపీ దుష్పాలనపై ‘భారత్‌జోడో యాత్ర’ పేరిట కాంగ్రెస్ పోరుబాట పడుతున్న తరుణంలో సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆజాద్ లేఖ రాయడం అత్యంత విచారకరం’’ అని శనివారం వ్యాఖ్యానించారు. ‘ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఆజాద్ వేర్వేరు హోదాలను అనుభవించి, పార్టీకి అవసరమైన కీలక సమయంలో నిష్క్రమించడం, నిందించడం దారుణం’ అన్నారు. -
పంజాబ్ ముఖ్యమంత్రుల విద్యా ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఎన్నికల హోరు జోరందుకుంది. 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరించి హరియాణా విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్ఞానీ గురుముఖ్ సింగ్ ముసాఫిర్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ వరకు 12మంది అధికారపీఠంపై కూర్చున్నారు. (క్లిక్: వామ్మో.. 94 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ.. ఎవరో తెలుసా?) ముసాఫిర్ కవి, రచయితగా సాహిత్య అకాడమీ అవార్డును అందుకోగా, చరణ్‌జీత్ సింగ్ చన్నీ న్యాయశాస్త్ర పట్టా తీసుకొని, ఎంబీఏ పూర్తిచేసి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటివరకు సీఎంలు అయినవారిలో ఏడుగురు సాధారణ గ్రాడ్యుయేట్లు కాగా, ముగ్గురు లా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంతేగాక గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేకపోయిన ఇద్దరు సీఎంలు అయ్యారు. (చదవండి: గాడ్ ఫాదర్ లేరు.. అయితేనేం..) -
730 పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఏం చదవాలి.. ఎలా చదవాలి..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రెండు శాఖలు, 730 పోస్ట్‌లు ►ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. అవి.. ►ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు–670. ►దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3–పోస్టులు– 60. ►అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ►బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. రాత పరీక్షలో మెరిట్ ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్‌లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్ మాత్రం జూనియర్ అసిస్టెంట్స్ పోస్ట్‌లకు,ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం ఉంది. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ►ఒక్కో పోస్ట్‌కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ►ఒక్కో పోస్ట్‌కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లు ఇలా ►రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష విధానాలు.. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్‌లలో 150 మార్కులకు జరగనుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 స్క్రీనింగ్ టెస్ట్: ►ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు.. ►రెండు పోస్ట్‌లకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిగా పెన్ పేపర్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు నింపాలి. ►నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు నిర్వహించే పార్ట్–బి పేపర్లో.. జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్(ఆన్లైన్) టెస్ట్‌గా ఉంటుంది. ►జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్: ఈ పరీక్ష రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు.. ►పేపర్–2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ►ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఎండోమెంట్ సబ్ సర్వీస్) మెయిన్: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు.. ►ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ►ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా ►రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్ టెస్ట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే మెయిన్ పరీక్షలోనూ పేర్కొన్నారు. ►స్క్రీనింగ్, మెయిన్లకు ఒకే సిలబస్ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్‌లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది. ►కాబట్టి మొదటి నుంచే మెయిన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్ టెస్ట్‌లో సులభంగా విజయం సాధించి మెయిన్‌కు అర్హత పొందొచ్చు. ►అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ముందే ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల సిలబస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ►భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకొని.. వాటి ప్రిపరేషన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. ►దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్‌లకు స్క్రీనింగ్, మెయిన్‌లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్‌కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి. ►పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు, ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి. ►జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి. ►మెంటల్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి. ►రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్‌లకు పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్‌లపై పట్టు సాధించాలి. ఒకే సమయంలో రెండు పోస్ట్‌లకు ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది. ఈ పేపర్‌కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగిస్తూ.. రెండో పేపర్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్ పరిశీలన నుంచి ప్రిపరేషన్ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 60 ►వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870 ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ శాఖ) (గ్రూప్–4 సర్వీసెస్) ►మొత్తం పోస్టుల సంఖ్య: 670 ►ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870. ►అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ►వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022 ►వెబ్సైట్: https://psc.ap.gov.in -
నకిలీ విద్యార్హతలు అవినీతి కాదా?
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఎక్కడ మాట్లాడినా పురాతన విషయాలనే ప్రచారం చేస్తున్నారు. మే 30న మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే విద్యారంగంలో హిందుత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయడానికే ఆయన్ను నియమించినట్లు తెలిసిపోయింది. అప్పటి నుండి అయన అదే పనిలో ఉన్నారు కూడా. గత ఆగస్టు పదో తేదీన బాంబే ఐఐటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ‘ఆయుర్వేద ఆద్యుడు చరకుడే అణువు, కణమును కనిపెట్టాడని, కానీ వాటిని కనిపెట్టింది గ్రీకు తత్వవేత్త డెమోక్రిటిస్ అని పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నార’ని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆగస్టు 27న ఖరగ్‌పూర్ ఐఐటీ స్నాతకోత్సవ సభలో చేసిన ప్రసంగంలో ‘ప్రపంచంలో మొదటి భాష సంస్కృతమేనని, కాదని ఎవరైనా అనగలరా’ అని సవాల్ చేశారు. ‘సంస్కృతం శాస్త్రీయ భాష అయినందున భవిష్యత్తులో మాట్లాడే కంప్యూటర్లు అంటూ వస్తే అవి సంస్కృత భాషలోనే అని సెలవిచ్చారు. వేదాల కంటే మొదటి గ్రం«థం ఇంకేదైనా ఉందని ఎవరైనా చెప్పగలరా’ అని కూడా ప్రశ్నించారు. ‘శ్రీలంకకు సముద్రంపైన రామసేతు నిర్మించిందెవరు? అమెరికా, బ్రిటన్ ఇంజనీర్లా? భారతీయ ఇంజనీర్లే అని చెప్పాలి కదా. ఇలాంటి విషయాలపై పరిశోధనలు చేసి రుజువు చేయాల్సిన బాధ్యత ఐఐటీయన్లదేన’నీ కర్తవ్యబోధ కూడా చేశారు. ఆగస్టు పదహారున ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘శిక్షా సంస్కృతీ ఉత్తాన్ న్యాస్’ నిర్వహించిన జ్ఞానోత్సవ్ కార్యక్రమంలో సైన్స్ టెక్నాలజీలో మనమే ఫస్ట్ అన్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ కంటే ముందు మన దేశంలోనే కనిపెట్టారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి పోఖ్రియాల్ విద్యార్హతల విషయం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రిగా చేసిన ప్రమాణ పత్రంలో ‘డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్‘ అని పేర్కొనడం తప్పు అని, అందువలన అయన ప్రమాణాన్ని రద్దు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ రెబెల్ లీడర్ మనోజ్ వర్మ రాష్ట్రపతి రామనాథ్ కోవిందుకి ఆగస్టు 27న ఫిర్యాదు చేశారు. ‘ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్, కొలంబో’ నుండి పొందినట్లు హరిద్వార్ నియోజకవర్గం నుండి పోటీకి సమర్పించిన అఫిడవిట్లో రాసుకున్న ‘డాక్టరేట్’ ఫేక్ (నకిలీ) అని వర్మ తన ఫిర్యాదులో ఆరోపిం చాడు. అది పోఖ్రియాల్‌ని బదనాం చేయాలనే దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ మాత్రమేనని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తున్నా.. దానికి రుజువులున్నాయని వర్మ సవాల్ చేస్తున్నాడు. ఆ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ, డిప్లమాలకు గుర్తింపు లేదని శ్రీలంక యూజీసీనే ప్రకటించిందని, అసలా యూనివర్సిటీని భారత ప్రభుత్వం గుర్తించలేదని వాదించాడు. అంతేకాదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హేమవతీ నందన్ బహుగుణ యూనివర్సిటీ నుండి పొందినట్లు పోఖ్రియాల్ పేర్కొన్న ఎమ్.ఏ. డిగ్రీ కూడా నమ్మదగింది కాదని గతంలో రాజేష్ మధుకాంత్ అనే అతను సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. ఆ విషయంలో 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆర్డర్ వేసినా సమాధానం రాలేదనే విషయాన్ని గుర్తుచేశాడు. అవిగాకపోయినా, కేంద్ర విద్యామంత్రికి ఇంకా నాలుగు డిగ్రీలు ఉన్నట్లు ఎంహెచ్ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించినట్లు ’ది ప్రింట్’ వెబ్ పేపర్ పేర్కొన్నది. ఒకవైపు దేశమంతటా అలజడి రేపుతున్న వివిధ యూనివర్సిటీల పేరుతొ వెలువడుతున్న నకిలీ సర్టిఫికెట్ల సమస్యపై విచారణ కమిటీ వేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆగస్టు 30న యూజీసీని కోరింది. మరోవైపు విద్యామంత్రి సర్టిఫికెట్లే వివాదంగా మారాయి. అధికారంలో ఉన్నవారిపై వచ్చే ఆర్థిక నేరారోపణలు అలా పక్కనపెట్టండి.. నకిలీ విద్యార్హతలు కలిగి ఉండడం అవినీతి కాదా అనే ప్రశ్నకూడా సమంజసమైందే. విద్యామంత్రి విద్యార్హతలే వివాదంగా మారితే దేశంలో నకిలీ సర్టిఫికెట్ల దందా బంద్ అవుతుందని ఆశించగలమా? వ్యాసకర్త: నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
రాహుల్ అఫిడవిట్‌పై అనుమానాలు
అమేథీ/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ పేర్కొంది. వీటిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్‌లాల్ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. ఈ అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ లాయర్ సోమవారం వరకు గడువు కోరారని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు. -
అర్హతల ఆధారంగానే వలసలకు అనుమతి
వాషింగ్టన్: అర్హతల ఆధారంగానే వలసలను అనుమతిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. కఠిన వలస విధానాలపై ఇంటాబయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష డెమోక్రాట్లు, మీడియా తీరుపైనా ఆయన విరుచుకుపడ్డారు. అక్రమ వలసదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, బాధితులను శనివారం ట్రంప్ వైట్‌హౌస్‌లో కలుసుకుని మాట్లాడారు. దేశ సరిహద్దులతోపాటు పౌరులకు కూడా భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర దేశాల వారు ఇక్కడికి రావడాన్ని కోరుకుంటున్నామనీ, అయితే, అది పద్ధతి ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ‘సమర్థత ఆధారంగానే వలసలను కోరుకుంటున్నాం. అంతేకానీ, అనర్హులకు కూడా అనుమతి ఇచ్చే డ్రా విధానాన్ని మాత్రం కాదు’ అని ‘యాంజెల్ ఫ్యామిలీస్’గా పేర్కొనే బాధిత కుటుంబాలతో అన్నారు. ‘విదేశీ నేరగాళ్ల కారణంగానే దేశంలో నేరాల రేటు పెరుగుతోంది. బాధిత కుటుంబాల ఇబ్బందులపై చర్చించటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లతోపాటు, బలహీన వలస విధానాలను బలపరిచే కొందరు ఇష్టపడడం లేదు’ అని ట్రంప్ ఆరోపించారు. 2011 గణాంకాల ప్రకారం విదేశీ నేరగాళ్ల కారణంగా దేశంలో 25వేల హత్యలు, 42వేల దోపిడీలు, 70వేల లైంగిక నేరాలు, 15వేల కిడ్నాప్‌లు జరిగాయని తెలిపారు. గత ఏడేళ్లలో ఒక టెక్సస్‌లోనే 6 లక్షల నేరాలకు సంబంధించి 2.5లక్షల మందిని అరెస్ట్ చేశామన్నారు. ‘హెరాయిన్ అతిగా తీసుకున్న కారణంగా కేవలం 2016లోనే 15వేల మంది చనిపోయారు. దేశంలోకి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్‌లో 90 శాతం దక్షిణ సరిహద్దుల నుంచే వస్తోంది’ అని అన్నారు. 2017లో అరెస్టయిన 8 వేల మంది విదేశీ నేరగాళ్లను బలహీన చట్టాల కారణంగానే విడిచి పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘ప్రజలను చంపేస్తోన్న డ్రగ్స్ సరఫరాదారులను పట్టుకుని వదిలి పెడుతుంటే ఈ మీడియా ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు. అక్రమ వలస నేరగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, ఇబ్బందులు పడిన వారికి సాయ పడేందుకు ‘వాయిస్’ అనే విభాగాన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ట్రంప్ 2017లో ఏర్పాటు చేశారు. -
సర్పంచ్‌గిరి..పది తప్పనిసరి..!
నేలకొండపల్లి : పంచాయతీలను బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం సర్పంచ్‌కు ఎన్నికయ్యే వ్యక్తి విధిగా పదో తరగతి ఉతీర్ణులై ఉండాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. పల్లెల అభివృద్ధికి పాలనా పరమైన అంశాలలో ఇతరులపై ఆధారపకుండా ఉండేందుకు ఈ నిబంధన దోహదం చేస్తుందని పాలకులు భావిస్తున్నారు. ఇందుకు గాను క్ష్రేత్ర స్థాయిలో అక్షరజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కాని ఈ విధా నం ప్రత్యేక్షమా, పరోక్షమా తెలియక నాయకులు, ప్రజలు సంగ్ధిదంలో ఉన్నారు. ఇదిలా ఉండగా మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహి ంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతుకు తగిన విధంగా అధికారులు సైతం పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి విద్యార్హతా లేకుండా సర్పంచ్‌కు పోటీ చేశారు. కాని ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో అభ్యార్థుల ఎంపిక కష్టంగా మారింది. గతంలో కొందరు సర్పంచులు నిరక్షరాస్యులు కావడంతో పాలనకు సంబంధించిన అంశాలపై ఇతరులపై ఆధారపడవలసి వచ్చేది. జిల్లాలోని పంచాయతీల్లో సగం మంది సంతకాలకే పరిమితమవుతున్నారు. అంతేకాక మండల పరిషత్ సమావేశాలో సమస్యలపై మాట్లాడలేని వారు కూడా ఉన్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పదో తరగతి పాసైన వారు కేవలం పది శాతం మంది మాత్రమే ఉండటంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిబంధనను ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. పదో తరగతి విధానం చాలా మంచిది.. చదువుకున్న వారికి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ప్రభుత్వం పథకాలు అర్హలకు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. ఈ విధానం అమలైతే నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. -జెర్రిపోతుల అంజిని, యూత్, నేలకొండపల్లి పది నిబంధనను స్వాగతిస్తున్నాం.. సర్పంచ్ ఎన్నికకు ప్రభుత్వం తీసుకున్న పది పాస్ నిబంధనను స్వాగతిస్తున్నాం. దీని వలన పాలనలో పారదర్శకత పెరుగుతుంది. కనీస విద్యార్హత నిర్ణయం చాలా మంచి పరినామంగా బావిస్తున్నాం. ఈ విధానంను వెంటనే అమలు చేయాలి. – శీలం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు,నేలకొండపల్లి. -
ఎస్సీ నిరుద్యోగ యువతకు... ఇక సులువుగా కొలువు!
ప్రత్యేక జాబ్ యాప్‌కు శ్రీకారం చుట్టిన ఎస్సీ కార్పొరేషన్ ∙ ఇంటర్, డిగ్రీ మధ్యలో ఆపేసిన వారిని దృష్టిలో పెట్టుకొని తయారీ అందులో వివరాలు నమోదు చేసుకుంటే శిక్షణ, ఉపాధి బాధ్యత కార్పొరేషన్‌దే ∙ త్వరలో అందుబాటులోకి తేనున్న ఎస్సీ అభివృద్ధి శాఖ సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రాడ్యుయేషన్, అంతకు మించిన కోర్సులు చదివిన ఎస్సీ యువతకు సులువుగా ఉద్యోగాలు దొరుకుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సులను మధ్యలో మానేసిన యువతీ యువకులు ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాబ్ యాప్‌ను తీసుకురానుంది. అర్ధంతరంగా చదువు ఆపేసిన యువతకు ఈ యాప్ ద్వారా తప్పనిసరి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ యాప్ రూపకల్పనపై అధికారులు సాంకేతిక నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపారు. అతి త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. నైపుణ్యాభివృద్ధి తర్వాతే ఉద్యోగం... ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల్లో విద్యార్హతతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్సీ కార్పొరేషన్...నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి కల్పించడంపై దృష్టి సారించింది. కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చే యాప్‌లో ముందుగా అభ్యర్థి వివరాలు నమోదు చేసుకోవాలి. విద్యార్హతతోపాటు ఆసక్తి, అనుభవాన్ని సైతం తెలియజేయాలి. అలా ఆసక్తి, అర్హతల ఆధారంగా అభ్యర్థుల వివరాలను కార్పొరేషన్ విశ్లేషిస్తుం ది. ఆ తర్వాత వారిని కేటగిరీలవారీగా విభ జించి తగిన రంగంలో శిక్షణ ఇస్తుంది. నిర్ణీత గడువులో శిక్షణ పూర్తిచేసుకొని మెరుగైన ప్రతి భ కనబర్చిన వారికి సంబంధిత కంపెనీల్లో ఉద్యోగాలు సైతం కల్పిస్తుంది. అవసరమైతే మరికొంత కాలం శిక్షణ తరగతులు కూడా నిర్వహించి బ్యాచ్‌లోని వారందరికీ పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయనుంది. ఉద్యోగ కల్పనకు ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అపోలో హాస్పిటల్స్, కెల్ట్రాన్, సెంట్రో, నాక్ తదితర ప్రఖ్యాత సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పించింది. ఎస్సీ యువతకు ఉపాధిని విస్తృతం చేసే క్రమంలో ఈ యాప్‌ను తయారు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరామ్ భూక్యా ‘సాక్షి’కి తెలిపారు. -
తగిన ఉద్యోగం దొరకడం లేదా?
అర్హతలు ఉన్నా కొందరికి ఉద్యోగం దొరకడం దుర్లభం. దొరికినా అర్హతలకు, అనుభవానికి తగిన జీతం దొరకవు. ఆర్థిక ఇబ్బందులు, నిరాశా నిస్పృహలు వెన్నాడుతాయి. తరచు ఆరోగ్య సమస్యలు పీడిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి కొన్ని పరిహారాలు... అరచేతిలో పట్టేంత పరిమాణంలో ఉన్న రాగిపాత్రలను తీసుకోండి. వాటిని శనగపిండితో తయారు చేసిన లడ్డూలతో నింపి, పాత్రలతో సహా ఆ లడ్డూలను ఐదుగురు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఈ పరిహారాన్ని ఆదివారం లేదా గురువారం ఆచరించడం మంచిది.ప్రతిరోజూ రుద్రగాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించండి. కొత్త ప్రయత్నం ఏదైనా ప్రారంభించే ముందు పూజలో పసుపు వినాయకుడి ముందు ఆకులు వక్కలు ఉంచి, నిర్విఘ్నంగా పని పూర్తికావాలని వేడుకుని, గణపతి మంత్రాన్ని 11 సార్లు జపించండి. ప్రతి శనివారం మధ్యాహ్నం నల్ల నువ్వులు కలిపిన అన్నం ముద్దలను కాకులకు పెట్టండి. ఆదివారం సూర్యోదయ వేళ రాగి పాత్రలో బెల్లం కలిపిన పానకాన్ని సూర్యుడికి నివేదించి, ఆ పానకాన్ని చిన్నారులకు పంచిపెట్టండి.ప్రతినెలా పున్నమి, అమావాస్య రోజుల్లో కనీసం ముగ్గురు వికలాంగులకు భోజనం పెట్టండి. ప్రతి గురువారం ఆవులకు అరటిపండ్లు తినిపించండి రావిచెట్టు మొదట్లో ఆవనూనెతో దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలో రెండు లవంగాలను వేసి, ఇష్టదైవాన్ని ప్రార్థించండి. – పన్యాల జగన్నాథ దాసు -
టీచర్ పోస్టుల భర్తీలో రెండు రకాల విద్యార్హతలు!
- గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అవే నిబంధనలు - 2007కు ముందు ఓసీలకు 45 శాతం మార్కులు - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులుంటే చాలు - 2007 తర్వాత ఓసీలకు 50% మార్కులు ఉండాల్సిందే - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు చాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో పాటిం చాల్సిన విద్యార్హత నిబంధనలపై విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో 7,600 టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధ నలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందజే సింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 7,892 పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలపై కసరత్తు చేస్తోంది. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం 2007కు ముందు ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతోపాటు ఆయా కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం చాలు. 2007 తరువాత ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతో పాటు ఆయా కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) వంటి గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోనూ ఇవే నిబంధనలను అమలు చేయాలని దీని కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) వంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులైతే చాలని, ఎలాంటి మార్కుల నిబంధన అవసరం లేదని గురుకుల పోస్టుల కోసం అందజేసినట్లు సమాచారం. పాఠశాల విద్యాశాఖ పరిధి లోని స్కూళ్లలో టీచర్ పోస్టులకు కూడా ఇవే నిబంధనలు ఉండేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన రెండంచెల పరీక్ష విధానం (ప్రిలిమ్స్, మెయిన్స్) కాకుండా పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి వేరుగా పరీక్ష విధానం రూపొందించే అంశంపై కసరత్తు చేస్తోంది. జనరల్ స్టడీస్ వంటి సబ్జెక్టులు లేకుండా, విద్యా పాఠ్య ప్రణాళికలు, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం పరీక్ష విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వేరుగానే పరీక్ష విధానం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
ప్రజాస్వామ్యానికి ‘అర్హతల’ తూట్లు
జాతిహితం ఎలాంటి అర్హతల ఆంక్షలూ లేని శాసనసభ్యులు పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి అర్హతలను నిర్ణయిస్తారు. పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులు ఎవరైనా శాసనసభకు ఎన్నికై, తమలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేయొచ్చు. బ్రిటిష్‌వారు ఓటింగ్ హక్కుకు పెట్టిన అర్హతలన్నిటినీ అంబేడ్కర్ రాజ్యాంగం చెత్తబుట్టలో పడేసింది. కాబట్టే మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. కాగా ఎన్నుకోదగినవారు ఎవరనే ఉన్నత వర్గవాద వైఖరిని చేపట్టిన పాకిస్తాన్‌కు దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు. నేనే గనుక యువకుడిని, మరింత ధైర్యవంతుడిని, విద్వత్తుగలవాడిని అయితే, స్వయంగా నేనే ఈ మాటలను రాసేవాడిని. వాటిలో ఏదీ కాను కాబట్టి అవన్నీ ఉన్న మరొకరు రాసిన మాటలను నిస్సంకోచంగా అరువు పుచ్చుకుంటాను. గౌరవనీయ భారత అత్యున్నత న్యాయస్థానంతో వాదనకు దిగేటప్పుడు ఆ వ్యక్తి మాటల వెనుక దాక్కోవడానికి వెనుకాడను. ఇది, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత గురువారం వెలువరించిన తీర్పు గురించి. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్య, ఆర్థిక, సామాజిక అర్హతా ప్రమాణాలను నిర్దేశిస్తూ హరియాణా ప్రభుత్వం తెచ్చిన చట్టం సమంజసమైనదేనని సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ‘ఓటు హక్కు, అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కేగానీ, ప్రభుత్వ పదవుల్లోకి ఎన్నిక కావడం ప్రాథమిక హక్కు కాదు.’ ఇది, కనీసం పట్టణ ఉన్నత వర్గీయుల మన్ననలందుకున్న సంక్లిష్టమైన ఈ చట్టానికి సమర్థనగా గౌరవ న్యాయస్థానంవారు చేసిన కీలక వాదన సారం. మంచీచెడు విచక్షణ చదువుకున్నోళ్ల సొత్తా? మరోవంక ఇది, ఎవరు ఎన్నిక కావాలనేదాన్ని నిర్ణయించే విశేషహక్కును (ఈ పదం మాత్రం నేను ఎంచుకున్నది) చట్టసభలకు కట్టబెట్టటం కూడా అవుతుంది. ఈ నిర్దిష్ట సందర్భానికి సంబంధించి అది, ప్రాథమిక విద్య లేదా అక్షరాస్యత, రుణగ్రస్తులు కాకుండటం (కొన్ని పరిమితులతో), ఇంట్లో మరుగు దొడ్డి ఉందా లేక గత్యంతరం లేకనో, స్వచ్ఛందంగానో బిహిరంగ మల మూత్ర విసర్జన చేస్తున్నారా? అనేలాంటి సామాజిక పారిశుద్ధ్యానికి సంబంధించిన కొన్ని నియమాలకు మాత్రమే పరిమితమైంది. భారతీయుల్లో 60% బహిర్భూములనే ఉపయోగిస్తున్నారు. ‘‘విద్యవల్ల మాత్రమే మను షులకు మంచీచెడూ, తప్పూఒప్పూ విచక్షణ చేయగల శక్తి సమకూరుతుంది’’ అని న్యాయమూర్తులు అత్యంత ప్రాధాన్యంగల వాక్యాన్ని ప్రయోగించారు. అది ఆమోదనీయమైన మాటేగానీ, ప్రశ్నింపదగినది? ఇపుడింతకూ విద్యకు నిర్వచనం ఏమిటి? పంచ్ లేదా సర్పంచ్ కావాలనుకునే వారికి అర్హత కాలేజీ డిగ్రీనా, ప్రజ్ఞా సూచిక పరీక్షా (ఐక్యూ టెస్ట్), స్థాయిని తగ్గించిన ‘కాట్’ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లాంటి దానికి సమానమైనదా? విద్వత్తుకు, పరిపాలనాపరమైన నాణ్యతకు మధ్య లంకె ఉన్నదనడానికి ఉన్న ఆధారాలు క్లిష్టమైనవి. ఈ తీర్పు, బీజేపీ చేసిన చట్టానికి ఆమోద ముద్రవేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత చరిత్రలోనే అత్యంత అధ్వాన ప్రభుత్వాన్ని నడిపారనీ, నేటి ప్రభుత్వం అత్యుత్తమమైనదనీ విశ్వ సించే ఆ పార్టీ మద్దతుదార్లైన పట్టణ ‘‘విద్యావంతుల’’ నుంచి ఈ చట్టానికి విస్త్రుతమైన మద్దతు లభించింది. సాంప్రదాయక విద్యాపరమైన తెలివితేటల తర్కానికి ఈ అంశం ఎలా నిలుస్తుందని ప్రశ్నించాలనే దుగ్ధ ఇప్పుడు కలుగు తోంది. కానీ ఆ విషయం జోలికి కూడా మనం పోవద్దు. ఎవరు ‘‘మంచీచెడులను, తప్పుఒప్పులను విచక్షణ చేయగల శక్తి’’ కలిగినంతటి విద్యావంతులు అయ్యారో నిర్ణయించేది ఎవరు? అత్యంత వ్యక్తిగతమైనదైన ఆ నిర్ణయాన్ని పైనుంచి కింది వరకు తీసుకోవాల్సినవారు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. తమకంటూ అలాంటి ఏ అర్హతలు ఏవీ ఇంతవరకూ లేనేలేని వారే పంచాయతీలకు ఎన్నికయ్యే వారికి కనీస అర్హతలను నిర్ణయిస్తారు. మీరే గనుక పూర్తి నిరక్షరాస్యులైన హరియాణా పౌరులైతే, ఇప్పుడు మీరు శాసనసభకు ఎన్నికై, మీలాంటి వారిని పంచాయితీ ఎన్నికలకు అనర్హులను చేస్తూ చట్టాలు చేసేయొచ్చు. నా సొంత రాష్ట్రమైన అక్కడ 25% ప్రజలు పూర్తి నిరక్షరాస్యులే. లోక్‌సభకు కూడా అలాంటి ఆంక్షలు వర్తించవు. నేటి లోక్‌సభలోని 543 మంది సభ్యులలో 16 మంది మెట్రిక్యులేషన్ లోపు చదువుకున్నవారు. ఇది హర్యానా శాసనసభ పంచాయితీలకు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ. అన్నా హజారే ఉద్య మం, జన్‌లోక్‌పాల్ ప్యానెల్‌కు నోబెల్, మెగసెసే బహుమతులందుకున్న వారిని నామినేట్ చేయడాన్ని మాలాంటి వాళ్లం ఉన్నత వర్గవాదమని ప్రశ్నించ సాహసించాం. జనతాదళ్-యూకు చెందిన శరద్‌యాదవ్ పార్ల మెంట్ వైఖరికి మద్దతుగా నిలిచి, మన ప్రజాస్వామ్య వ్యవస్థే లేకపోతే పకోరీలాల్ వంటి వాళ్లు ఇక్కడ కూచునేవారేనా? అని ప్రశ్నించారు. పకోరీలాల్ ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్పీ సభ్యుడు. మెట్రిక్యులేషన్లోపు చదువుకున్న ఎంపీలలో ఆయనా ఉన్నారు. చెత్తబుట్టలోని ‘అర్హతలకు’ పట్టం ఇది సుప్రీం కోర్టు ఆదేశం కాబట్టి, దాని అంతరార్థాన్ని ఇతర సందర్భాలకు అన్వయించడాన్ని అనుమతించవచ్చునేమో. అయితే దాన్ని పైకి కూడా వర్తింపజేయవచ్చు. అంటే ఇక లోక్‌సభలో పకోరీలాల్లు ఉండరా? అత్యు న్నత విద్యావంతులు మనకు ప్రాతినిధ్యం వహించడమనేది అద్భుతమైన ఆలోచన. కానీ ప్రజాస్వామ్యమంటే ముందస్తుగా నిర్వచించిన లోపరహిత మైన స్థితి కాదు. సరికదా, అందుకోసం నిరంతరం పోరాడటం. 1935లో బ్రిటిష్ వారు వయోజన ఓటింగ్‌ను కొంత మేరకు అనుమతించినప్పుడు అలాంటి కనీస అర్హతలను నిర్ణయించారు. అలా కేవలం 3.5 కోట్ల మందికి లేదా జనాభాలో 20 శాతానికి ఓటు హక్కును ఇచ్చారు. మహిళలు వారిలో కేవలం ఆరో వంతు మాత్రమే. అంబేడ్కర్ రచించిన అద్భుత రాజ్యాంగం ఆ అర్హతలన్నిటినీ తీసి చెత్తబుట్టలో పడేసింది. కలవరపడాల్సిన పలు లోపా లున్నా 65 ఏళ్లుగా మన ప్రజాస్వామ్యం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండటం దాని ఫలితమే. ఎన్నుకోదగినవారు ఎవరనే ఆ ఉన్నత వర్గవాదవైఖరినే పాకి స్తాన్ కొనసాగించింది. దానివల్ల ఎంత మంచి జరిగిందో మీరే చూడొచ్చు. పాకిస్తానీ ఉన్నత వర్గాలు ఆ అభూత కాల్పనికతకు మళ్లీ మళ్లీ వెళ్లి వచ్చాయి. 2002లో పర్వేజ్ ముషర్రాఫ్, పోటీకి కనీసార్హతగా గ్రాడ్యుయేషన్‌ను నిర్ణయిం చారు. అయితే మతపెద్దల మాటకు తలొగ్గి మదరసాల సనద్లను (డిప్లొ మాలు) కూడా వాటితో సమాన అర్హతగానే గుర్తించారు. ఆయన నిష్ర్కమణ తదుపరి సక్రమంగా జరిగిన ఎన్నికల్లో ఆ నిబంధనను రద్దుచేశారు. బ్యాంకు లకు రుణపడి ఉన్నవారు మొదలు, ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావమూ చూపనివారి వరకు అనర్హులను చేస్తూ ఆ దేశం పలు ప్రయోగాలు చేసింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ద్వారా మద్దతు తెలిపిన హరియాణా చట్టం సహకార సంస్థలకు, విద్యుత్ సంస్థలకు బకాయిలుపడ్డవారిని కూడా అనర్హు లను చేసింది. ఎన్నికలన్నీ వ్యయంతో కూడుకున్నవేనని అది పేర్కొంది. కాబట్టి, ఎవరైనా, ఏదైనా పదవికి పోటీ పడుతున్నారంటేనే ఆమె లేదా అతడు ముందుగా తమ రుణాలను చెల్లించేయాలి లేదా ప్రజా ప్రతినిధి కావా లనే యోచనే చేయకుండా ఉండాలి. చక్కటి నైతిక వాదన. కానీ మీరు దీన్ని బకాయిదారుల ఛాంపియన్ అయిన రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాతో మొదలు పెట్టి, ఆ తర్వాత అప్పు చేసి గేదెను కొనుక్కోగా, అది కాస్తా ఆంత్రాక్స్ రోగంతో చనిపోయి బాధపడుతున్న దళిత మహిళ అప్పు జోలికి వెళ్లరాదూ? హరియాణా ప్రజలను విఫలం చేసిన రాజకీయ వర్గమే ఈ చట్టం ద్వారా వారిని నేడు పరాభవం పాలు చేసింది. తలసరి ఆదాయాల రీత్యా అది దేశం లోనే అతి సంపన్న రాష్ట్రం, కానీ సామాజిక సూచికల విషయానికొస్తే సిగ్గుప డాల్సిన స్థితి. స్రీ, పురుష నిష్పత్తి నేరంగా పరిగణించాల్సిన 879. కాగా అక్షరాస్యత రేటు, ప్రత్యేకించి మహిళల్లో అధమం. ఎన్నికైన ఏ ఉన్నత స్థాయి నేతా ప్రశ్నించడానికి సాహసించని కప్ పంచాయతీల పాలనసాగే ఆ గడ్డ మీదనే స్త్రీ, శిశుహత్యలు అతి విస్తృతంగా సాగుతున్నాయి. పాలకుల వైఫల్యాలకు ప్రజలకు శిక్షా? సుసంపన్నమైన ఒక రాష్ట్రం మీకు అక్షరాస్యత, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించ డంలో విఫలమైంది. అందుకుగానూ అది ఇప్పుడు మీకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరిస్తోంది. నాకైతే ఇది మరోసారి ‘‘సాలా మై తో సాహిబ్ బన్ గయా’’ అనే సజీనా (1974) సినిమాలోని దిలీప్‌కుమార్ పాటను గుర్తుకు తెస్తుంది. ప్రత్యేకించి ‘‘తుమ్ లంగోటీ వాలా న బద్లా హై న బద్లేగా, తుమ్ సబ్ కలా లోగే కిస్మత్ హమ్ సాలా బద్లేంగా ’’ (మీ గోచిపాతలోళ్లు మారలేదు, మారరు, కానీ నేనిప్పుడు ఎలా మీ తలరాత మార్చేస్తానో చూడండి) అనే చరణాలు గుర్తుకొస్తున్నాయి. ఈ ఉద్వేగంలో పడి కొట్టుకుపోవడం వల్ల ముంచుకొచ్చే ప్రమాదాలేమిటనే స్పృహ నాకుంది. కానీ తమరు ఆమోదముద్ర వేసినది ఇలాంటి ఆలోచనా రీతికేనని విన్నవిం చుకోవాల్సి ఉంది. గౌరవనీయులైన తమరు సదుద్దేశాలతోనే ఇది చేశారను కోండి. నాకంటే యువతరానికి చెందిన, ధైర్యవంతులు, పండితులు అయిన ఒక వ్యక్తి మాటలను దొంగిలించి, ఆమె వెనుక దాక్కుంటానని మీకు ముందే చెప్పాను. ఆమె పేరు అర్పితా ఫుకాన్ బిస్వాస్. అద్భుతమైన సామాజిక శాస్త్రవేత్త, పొవాయ్ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్. ఈ ఉదయం ఆమె ఈ తీర్పుపై తన వరుస ట్వీట్లతో (@Arpitapb) విద్య మాత్రమే మనకు మంచీ చెడు విచక్ష ణా శక్తిని ఇస్తుందా? ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడానికి పరిపా లనాపరమైన నైపుణ్యం ముందు షరతా? వంటి ప్రశ్నలను ట్వీట్లతో కురిపిం చింది. ఆమె హాష్‌టాగ్‌తో ుట్రంప్ఎవే అని ప్రయోగించింది. ఇప్పుడు నేను కూడా అంతే నిర్లక్ష్యంగా, దీని అర్థం సుప్రీంకోర్టు ఆదేశం సమాజం పట్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న నేత డోనాల్డ్ ట్రంప్ దృష్టిని ప్రతిబింబిస్తోందని చెప్పాలా? అంతకంటే నేనామె వెనుక నక్కి, ఆమె అలా అంది అంటాను. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మహిళల కోసం...మహిళల చేత...
లావణ్య సొంతంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనే ఆలోచనతో పని మొదలుపెట్టింది. కంపెనీ స్థాపించడానికి సహజంగానే బ్యాంకు రుణం కావాల్సివచ్చింది. ఓ ఐదారు బ్యాంకులు తిరిగింది. అన్ని బ్యాంకులు ఆమెకు రుణం ఇవ్వడం కుదరదన్నాయి. కావాల్సిన అర్హతలు లేవన్నాయి. కారణం అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందించారు. ఒకరు మహిళకు రుణం ఏమిటన్నారు, మరొకరు ఎవరైనా మగవారు పూచీకత్తు ఉండాలన్నారు, ఇంకొకరు వివరంగా కారణాలు చెప్పడానికే సమయం కేటాయించకుండానే పంపేశారు. ఈ ఏడాది మార్చి 31న హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో భారతీయ మహిళా బ్యాంకు(బి.ఎం.బి)ని ఏర్పాటు చేశారని తెలిసి లావణ్య అక్కడకు వెళ్ళింది. మేనేజర్ సుచరితను కలిసింది. వీళ్లు కూడా బ్యాంకు రుణం ఇవ్వడం కుదరదన్నారు. కానీ ఓ అరగంట లావణ్య అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం చెప్పి...బ్యాంకు రుణం పొందే మార్గాలను ఆమెకు వివరించారు. ‘‘మొదట నేనెళ్లిన బ్యాంకులు నాకు రుణం ఇవ్వడం కుదరదన్నందుకు నాకు కోపం రాలేదు, కానీ కారణాలు సరిగ్గా చెప్పకుండా విసుక్కున్నందుకు మాత్రం చాలా బాధేసింది. ఈ మహిళా బ్యాంకు పుణ్యాన...రుణాలకు సంబంధించి బోలెడన్ని విషయాలు తెలుసుకోగలిగాను’’ అని చెప్పింది లావణ్య. హైదరాబాద్‌లో భారతీయ మహిళా బ్యాంకు స్థాపించి రెండునెలలు కూడా కాలేదు. రెండు వందలమంది ఖాతాలు తెరిచారు. దేశంలో 23వ మహిళా బ్యాంకుగా విజయవంతంగా కొనసాగుతోంది. భారతీయ మహిళా బ్యాంకు...మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు. గత ఏడాది నవంబర్ 19న ముంబయిలో బ్యాంకు మొదటి శాఖను స్థాపించారు. గడచిన ఆరునెలల్లో దేశవ్యాప్తంగా 23 బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ బ్యాంకులన్నింటిలో 70శాతం మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. మహిళల కోసం మహిళలే నడిపే ఈ బ్యాంకులకున్న మరో ప్రత్యేకత...వారానికోసారి బ్యాంకు సిబ్బందే నేరుగా మహిళల దగ్గరికి వచ్చి ఖాతాలు తెరవడం. మెట్లపై కూర్చుని... హైదరాబాద్‌లో బి.ఎం.బి శాఖ ఏర్పాటు చేసిన సందులో మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు స్థాపిస్తున్నారని తెలిసినపుడు ఆ బ్యాంకుల్లోని సిబ్బంది ‘ఇన్ని బ్యాంకులుండగా...మళ్లీ ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు ఎందుకు’ అన్నారట. ఈ బ్రాంచ్‌లో మొత్తం ఐదుగురు మహిళా సిబ్బంది - ఒక మేనేజర్, ముగ్గురు ఆఫీసర్లు, ఒక డీఆర్‌ఒ. వీరితో పాటు ఒక సెక్యురిటీ గార్డ్, ఒక బాయ్ ఉన్నారు. శనివారం వచ్చిందంటే...ఓ ఇద్దరు ఆఫీసర్లు చుట్టుపక్కల డ్వాక్రా గ్రూపులున్న ప్రాంతాలకు వెళతారు. అక్కడ డ్వాక్రా గ్రూపుల మహిళలతో పాటు ఇతర మహిళలను కూడా కలిసి వందున్నా...వెయ్యి ఉన్నా..బ్యాంకులో భద్రపరుచుకోవడం గురించి వివరంగా చెప్పి ఒప్పించి వారితో ఎకౌంట్లు తెరిపిస్తున్నారు. ఈ పనితో పాటు మధ్యతరగతి మహిళలతో వ్యాపారం చేయించడానికి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు, అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ‘‘మొన్నీమధ్యనే ఒక మహిళతో బ్యూటీపార్లర్ పెట్టించాం. డే కేర్ సెంటర్లు, క్యాంటీన్లు, కర్రీపాయింట్లు...ఎలాంటి వ్యాపారాలకైనా మహిళలకు మా బ్యాంకులు పూటీకత్తు పేరెత్తకుండా రుణాలిచ్చి వ్యాపారాలు చేయించడానికి సిద్ధంగా ఉంది. రుణమిచ్చి ఊరుకోకుండా...వ్యాపారానికి కావాల్సిన మిగతా సౌకర్యాల విషయంలో కూడా మా బ్యాంకు సిబ్బంది సాయపడతారు. ప్రత్యేకంగా మహిళల కోసం బిఎమ్బీలు స్థాపించడంలో ఉన్న ఉద్దేశమిదే’’ అని చెప్పారు సుచరిత. ఇక్కడ బిఎమ్బీలో మహిళా సిబ్బంది పనితీరుని చూసి చాలామంది తమ ఎకౌంట్లను ఈ బ్యాంకుకి షిప్ట్ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. బ్యాంకు లక్ష్యాలను తెలుసుకున్న మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తాము చేయదలుచుకున్న వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. మహిళల ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ముందుకొచ్చిన భారతీయ మహిళా బ్యాంకుని అందరూ అభినందించాల్సిందే! -భువనేశ్వరి; ఫొటోలు: ఎ. సతీష్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘అందరూ మహిళలే ఉంటారంట..ఏదైనా సమస్య వస్తే వారు సమర్థంగా ఎదుర్కోలేరు’ అంటూ చాలామంది ప్రచారం చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాంకులోపలికి వచ్చేవారు కాదు. మగవాళ్ల సంగతి పక్కన పెట్టండి. మహిళలైనా లోపలికి వచ్చి చూడొచ్చు కదా! బోర్డు వంక చూసుకుంటూ పోయేవారు. ఇక చేసేది లేక..మేమే బయటికి వెళ్లి మెట్లమీద కూర్చుని వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ మా ప్రత్యేకతల్ని చెప్పుకొన్నాం. ఓ పదిరోజుల తర్వాత ఒక్కొక్కరూ రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మా పనితీరు, సహకారం చూసి ఈ నోటా ఆ నోటా ప్రచారం జరిగింది. మెల్లగా సంఖ్య పెరగడం మొదలైంది. ఇప్పటివరకూ ఓ ఇద్దరు మహిళా వ్యాపారస్థులకు వ్యాపారరుణాలు ఇచ్చాం’’. - సుచరిత, హైదరాబాద్ బిఎమ్‌బి బ్రాంచ్ మేనేజర్ -
కంపెనీ బోర్డుల్లో కానరాని యువశక్తి!
ఉరకలెత్తే యువ జనాభాతో అలరారుతున్న భారత్‌గా ప్రపంచదేశాల్లో మనకు గొప్పపేరే ఉంది. అయితే, ఒక రంగంలో మాత్రం యువశక్తి అంతకంతకూ ఆవిరైపోతోంది. తాజా గణంకాల ప్రకారం భారత్ కార్పొరేట్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో యువత సంఖ్య అట్టడుగుకు పడిపోయింది. బోర్డుల్లోకి కొత్తగా యువ డెరైక్టర్ల నియామకాలు కూడా అత్యంత ఘోరంగా తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2006 నుంచి చూస్తే... మన కంపెనీల్లో 25 ఏళ్లు అంతకంటే చిన్న వయసున్న డెరైక్టర్లుగా నియామకం పొందినవాళ్ల సంఖ్య అప్పట్లో 522 మందిగా ఉండేదని ఇండియన్‌బోర్డ్స్ డాట్ కామ్ పేర్కొంది. ఇప్పుడు ఈ సంఖ్య ఎనిమిదికి మించిలేకపోవడం గమనార్హం. అంటే ఏకంగా 98 శాతం మంది తగ్గిపోయినట్లు లెక్క. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లోని లిస్టెడ్ కంపెనీల డేటా ఆధారంగా ఇండియాబోర్డ్స్ ఈ గణాంకాలను రూపొందిస్తోంది. ‘కొంతమంది బోర్డు సభ్యుల వయసు 25 ఏళ్లు దాటిపోయి ఉండొచ్చు. మరికొందరు పదవి నుంచి వైదొలగవచ్చు. అయితే, 25 ఏళ్లలోపు వయసున్న కొత్త డెరైక్టర్ల నియామకం మాత్రం అడుగంటిపోయిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్(ఇండియన్‌బోర్డ్స్ డాట్ కామ్‌ను నిర్వహించే సంస్థ ఇది) ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అంతా సీనియర్ సిటిజన్లే... కంపెనీల బోర్డుల్లో యువ డెరైక్టర్ల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టేస్థాయికి చేరింది. ప్రస్తుతం డెరైక్టర్ల సగటు వయసు 60 ఏళ్లుగా అంచనా. అంటే దాదాపు సీనియర్ సిటిజన్ కిందే లెక్క. మరో ముఖ్యవిషయం ఏంటంటే... బోర్డుల్లో అత్యధికంగా(38.5 శాతం) డెరైక్టర్ల వయసు 46-60 ఏళ్ల మధ్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక 61-69 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు 20.3 శాతం. 36-45 ఏళ్లు; 26-35 ఏళ్లు; 70-80 ఏళ్ల వయసున్న డెరైక్టర్లు 2-13 శాతం వరకూ ఉన్నారు. ఇప్పుడున్న కంపెనీ బోర్డుల్లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ డెరైక్టర్ శాష్వత్ గోయెంకా అత్యంత పిన్నవయస్కుడిగా నిలుస్తున్నారని ఇండిన్బోర్డ్స్ డాట్‌కామ్ పేర్కొంది. ఆయన వయసు 23 ఏళ్లే. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, వార్టన్ స్కూల్ నుంచి గ్యాడ్యుయేషన్ చేసిన శాష్వత్.. నెస్లే, కేపీఎంజీల్లోనూ పనిచేశారు. నైపుణ్యమే అడ్డంకి... డెరైక్టర్‌గా ఎంపికయ్యే వ్యక్తుల నైపుణ్యాలు, అర్హతలు, సామర్థ్యం విషయంలో కంపెనీలు మరీ చాలా పక్కాగా వ్యవహరిస్తుండటమే యువకులకు అవకాశాలు తగ్గిపోయేందుకు దారితీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బోర్డు సీటుకు వయసు కంటే సామర్థ్యానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులు చెబుతున్నారు. ‘25 ఏళ్ల లోపు వయసున్నవాళ్లకు డెరైక్టర్ బాధ్యతలకు తగ్గ అనుభవం ఉండటం కష్టమే. ఏదైనా ఇంటర్నెట్ లేదా టెక్నాలజీ కంపెనీకి చెందిన వ్యక్తి తప్ప ఇంత తక్కువ వయస్కులు డెరైక్టర్ల పోస్టులను దక్కించుకోలేకపోతున్నారు. అదే ప్రమోటర్ సంబంధిత వ్యక్తులైతే సామర్థ్యంతో పెద్దగా పనిలేకుండానే బోర్డుల్లోకి వచ్చేసే అవకాశాలున్నాయి’ అని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వయిజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఎండీ అమిత్ టాండన్ అభిప్రాయపడ్డారు. అర్హత ఉంటే ప్రమోటర్ల కుటుంబీకులను బోర్డులోకి తీసుకోవడం పెద్ద సమస్యకాదని, అయితే, కేవలం ప్రమోటర్‌కు చెందిన వ్యక్తి అన్న కారణంతో డెరైక్టర్‌గా తీసుకోవడం మంచిపరిణామం కాదని స్టేక్‌హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఎండీ, వ్యవస్థాపకుడు జేఎన్ గుప్తా పేర్కొన్నారు. చాలామంది ప్రమోటర్లు తమకు బోర్డులో ఆదిపత్యం కోసం తమవాళ్లను నియమించుకుంటున్నారని... వాళ్లకిచ్చే జీతాలు కూడా చాలా భారీగానే ఉంటున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. -
నామినేషన్ వేసే ముందు ఇవి పాటించాలి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నెల 12న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు, విధివిధానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించింది. లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తికి నామినేషన్ వేసే చివరి తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. లోక్‌సభకు డిపాజిట్ రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి. అసెంబ్లీకైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. అభ్యర్థి గుర్తింపు గల రాజకీయపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అదే నియోజకవర్గానికి చెందిన మరొకరు ప్రతిపాదించాలి. రిజిష్టర్డ్ పార్టీకి చెందిన వారు పోటీ చేసినట్లయితే 10 మంది ప్రతిపాదించాలి. లోక్‌సభకు ఫారం-2ఏ పూరించాలి. అసెంబ్లీకైతే ఫారం-2బీ పూరించాలి. బుద్ధిమాంద్యం గల వారు పోటీకి అనర్హులు. ఎన్నికల కమిషన్ అనర్హుల జాబితా ప్రకటించిన వారు పోటీకి అనర్హులు. గతంలో నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల ఖర్చు వివరాలు తెలపని అభ్యర్థులు, అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి అనర్హులుగా తేలినవారు పోటీకి అనర్హులు. రూ.10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు మీద అఫిడవిట్లు తయారు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ధ్రువీకరించాలి. అలాగే రెండు రకాల అఫిడవిట్లు దాఖలు చేయాలి. అఫిడవిట్లో ఫొటో తప్పనిసరిగా అతికించాలి. అందులో ప్రతి కాలాన్నీ పూరించాలి. అభ్యర్థికి సంబంధించిన కేసుల వివరాలు, కుటుంబ సభ్యుల కేసుల వివరాలు ఫారం-1లో తప్పనిసరిగా పొందుపర్చాలి. ఫారం-26లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు పూరించాలి. పాన్‌కార్డు, స్థిర చరాస్తులు కనబర్చాలి. ఆదాయపుపన్ను చెల్లింపు వివరాలు అందజేయాలి. విద్యార్హతలు తప్పనిసరిగా నమోదు చేయాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉన్నట్లు తహశీల్దార్ ద్వారా సర్టిఫైడ్ ఓటరు కాపీ అందజేయాలి. పార్లమెంట్ అభ్యర్థులు రూ.70లక్షల వరకే ఖర్చు చేయాలి. అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.28లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీ చేసే ప్రతి అభ్యర్థీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నామినేషన్ తరువాత నుంచి అభ్యర్థి ఖాతాలో ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. అంతకు ముందు వరకు రాజకీయ పార్టీ ఖర్చులో నమోదు చేయాలి. స్టార్ క్యాంపెయిన్ (ప్రముఖులు) ప్రచారానికి వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వారు నలుగురు అభ్యర్థులు లేదా పది మంది అభ్యర్థులు వారి వెంట ఉన్నట్లయితే ఆ ఖర్చులో అందరికీ సమానంగా ఎన్నికల ఖర్చులో నమోదు చేస్తారు. అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలి. 100 మీటర్లలోపు 3 వాహనాలను మాత్రమే అనుమతించాలి. -
జిల్లాలో 136 వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల జాతర మొదలైంది. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 136 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 53 వీఆర్వో, 83 వీఆర్ఏ పోస్టులు భర్తీ చేయనుంది. రాత పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. వీఆర్వో వేతనం రూ.7,520, వీఆర్ఏ గౌరవ వేతనం రూ.3వేలతోపాటు అలవెన్స్‌లు ఇస్తారు. విద్యావంతులు తహశీల్దార్ కేడర్ వరకు పదోన్నతి పొందవచ్చు. చాలా రోజులుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతతో నిర్వహిస్తున్న ఈ పోస్టులకు డిగ్రీ, పీజీ, బీఈడీ, బీటెక్ తదితర ఉన్నత విద్యావంతులూ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాత పరీక్షకు మరికొద్ది రోజులే సమయం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే ఉద్యోగం మీ సొంతమవుతుంది. - న్యూస్‌లైన్, మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ టౌన్ గ్రామానికి అధికారి.. వీఆర్వో గ్రామానికి తొలి అధికారి వీఆర్వో(గ్రామ రెవెన్యూ అధికారి)నే. గ్రామాల్లోని ప్రజల సమస్యలపై మొదటగా స్పందించాల్సింది వారే. తుపాన్, కరువు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం, ఉన్నతాధికారులను సంప్రదించి నష్ట నివారణ చర్యలు చేపట్టడం, నష్టాన్ని నిబంధనల ప్రకారం లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, వివరాలు వారి వద్దనే ఉంటాయి. నీటి తీరువా, భూమి శిస్తు వసూలు, గ్రామ స్థాయిలో పంటల రకాలు, వాటి సరాసరి దిగుబడిపై అధికారిక సమాచారం కలిగి ఉండాలి. వీఆర్ఏ.. వీరు వీఆర్వోలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. వీఆర్వోల పనితీరు, ఖాళీల ఆధారంగా కేవలం పదేళ్లలోనే డెప్యూటీ తహశీల్దార్ స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వీఆర్ఏగా చేరిన వారు సర్వీసు పూర్తయ్యేలాగా డెప్యూటీ తహశీల్దార్ వరకు పదోన్నతి పొందుతారు. ఇవీ అర్హతలు వీఆర్వో పోస్టులకు : కనీస విద్యార్హత రెండేళ్ల ఇంటర్మీడియెట్ గానీ, మూడేళ్ల డిప్లొమా కోర్సు గానీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్లలోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల వరకు సడలింపు ఉంది. నిర్దేశించిన విద్యార్హత పూర్తయ్యే నాటికి వరుసగా నాలుగేళ్లపాటు జిల్లాలో చదివినవారు మాత్రమే ఇక్కడి పోస్టులకు అర్హులు. వీఆర్ఏ పోస్టులకు.. కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి 18 నుంచి 37 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42 ఏళ్లు, మాజీ సైనికులకు 40 ఏళ్లు, వికలాంగులకు 47 సంవత్సరాలు వరకు ఉండవచ్చు. పరీక్ష రుసుం రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో నివాసులై ఉండాలి షెడ్యూల్ వివరాలు... నోటిఫికేషన్ జారీ : డిసెంబర్ 28 దరఖాస్తుకు గడువు : వీఆర్వో పోస్టులకు జనవరి 12, వీఆర్ఏ పోస్టులకు 13వ తేదీ హాల్‌టికెట్ల జారీ : జనవరి 19 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2, 2014(వీఆర్వోలకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, వీఆర్ఏలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ) ప్రాథమిక కీ విడుదల : ఫిబ్రవరి 4 తుది కీ విడుదల : ఫిబ్రవరి 10 ఫలితాల ప్రకటన : ఫిబ్రవరి 20 నియామక ఉత్తర్వులు జారీ : ఫిబ్రవరి 26 పరీక్ష ఫీజు.. ఓసీ, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150. వికలాంగులకు పూర్తిగా మినహాయింపు. వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 12 వరకు ఏపీ ఆన్లైన్, మీ సేవ, ఈ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా భర్తీ చేస్తారు.. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను జిల్లాల వారీగా కాకుండా యూనిట్లుగా విభజించారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు. వీఆర్వో పోస్టులకు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జిల్లాలో ఎక్కడైనా విధులు కేటాయిస్తారు. వీఆర్ఏ పోస్టులకు ఖాళీలున్న నిర్దేశిత రెవెన్యూ గ్రామాలకు చెందిన అభ్యర్థులనే అర్హులుగా పరిగణిస్తారు. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో మండలంలోని ఏ గ్రామస్తులైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా ఆ నిబంధనను సవరించారు. రెవెన్యూ గ్రామం యూనిట్‌గానే భర్తీ చేయనున్నారు. పరీక్షలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వంద మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. రెండు పరీక్షలకు నెగెటివ్ మార్కులు లేవు. రెండింటికీ సిలబస్ ఒక్కటే అయినా ప్రశ్నల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో 60, అర్థమెటిక్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానం, ప్రభుత్వ పథకాలు, దేశ చరిత్ర, ఆంగ్లేయుల పాలన, తిరుగుబాటు, ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు, నాగరికత, ప్రాచీన యుగం, మధ్య యుగం ఇలా అనేక ప్రశ్నలు ఉంటాయి. వీఆర్వో ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యేవారు బాగా చదవాలి. అన్ని సబ్జెక్టుల్లో మార్కులు సాధించాలి. కఠోర సాధన చేయాలి. చదివినది గుర్తు పెట్టుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి సమయం చాలా తక్కువగా ఉన్నందున నమూనా ప్రశ్నపత్రాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పక్షం రోజులకు ఒకసారి నమూనా ప్రశ్నపత్రాలు తయారు చేసుకుని జవాబులు రాస్తూ మార్కులు, నైపుణ్యం స్థాయిని పరిశీలించుకోవాలి. తక్కువగా వస్తే మరింతగా సాధన చేయాలి. స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం కోచింగ్ తీసుకున్నా సమయం సరిపోదు. ఏపీ ఎకానమీ, జాగ్రఫి, 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. సిలబస్ మొత్తం పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రణాళికను సిద్ధం చేసుకుని చదవాలి. ఎక్కువగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పుస్తకాలు చదవాలి. దినపత్రికలు రోజు చదవడం అలవాటు చేసుకుంటే పరీక్షలకు సులువుగా ప్రిపేర్ కావచ్చు.