అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నెల 12న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు, విధివిధానాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించింది.
లోక్‌సభకు, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తికి నామినేషన్ వేసే చివరి తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి అయి ఉండాలి.
లోక్‌సభకు డిపాజిట్ రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి. అసెంబ్లీకైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు డిపాజిట్ చేయాలి.
అభ్యర్థి గుర్తింపు గల రాజకీయపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అదే నియోజకవర్గానికి చెందిన మరొకరు ప్రతిపాదించాలి. రిజిష్టర్డ్ పార్టీకి చెందిన వారు పోటీ చేసినట్లయితే 10 మంది ప్రతిపాదించాలి.
లోక్‌సభకు ఫారం-2ఏ పూరించాలి. అసెంబ్లీకైతే ఫారం-2బీ పూరించాలి.
బుద్ధిమాంద్యం గల వారు పోటీకి అనర్హులు.
ఎన్నికల కమిషన్ అనర్హుల జాబితా ప్రకటించిన వారు పోటీకి అనర్హులు.
గతంలో నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల ఖర్చు వివరాలు తెలపని అభ్యర్థులు, అఫిడవిట్‌లో
తప్పుడు సమాచారం ఇచ్చి అనర్హులుగా తేలినవారు పోటీకి అనర్హులు.
రూ.10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపరు మీద అఫిడవిట్‌లు తయారు చేసి ఫస్ట్‌క్లాస్
మెజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ధ్రువీకరించాలి. అలాగే రెండు రకాల అఫిడవిట్‌లు దాఖలు చేయాలి.
అఫిడవిట్‌లో ఫొటో తప్పనిసరిగా అతికించాలి. అందులో ప్రతి కాలాన్నీ పూరించాలి.
అభ్యర్థికి సంబంధించిన కేసుల వివరాలు, కుటుంబ సభ్యుల కేసుల వివరాలు
ఫారం-1లో తప్పనిసరిగా పొందుపర్చాలి.
ఫారం-26లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు పూరించాలి. పాన్‌కార్డు, స్థిర చరాస్తులు కనబర్చాలి.
ఆదాయపుపన్ను చెల్లింపు వివరాలు అందజేయాలి.
విద్యార్హతలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉన్నట్లు తహశీల్దార్ ద్వారా సర్టిఫైడ్ ఓటరు కాపీ అందజేయాలి.
పార్లమెంట్ అభ్యర్థులు రూ.70లక్షల వరకే ఖర్చు చేయాలి. అసెంబ్లీ అభ్యర్థులైతే రూ.28లక్షల లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
పోటీ చేసే ప్రతి అభ్యర్థీ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి.
నామినేషన్ తరువాత నుంచి అభ్యర్థి ఖాతాలో ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. అంతకు ముందు వరకు రాజకీయ పార్టీ ఖర్చులో నమోదు చేయాలి.
స్టార్ క్యాంపెయిన్ (ప్రముఖులు) ప్రచారానికి వచ్చినప్పుడు పోటీ చేస్తున్న వారు నలుగురు అభ్యర్థులు లేదా పది మంది అభ్యర్థులు వారి వెంట ఉన్నట్లయితే ఆ ఖర్చులో అందరికీ సమానంగా ఎన్నికల ఖర్చులో నమోదు చేస్తారు.
అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతించాలి.
100 మీటర్లలోపు 3 వాహనాలను మాత్రమే అనుమతించాలి.
నామినేషన్ వేసే ముందు ఇవి పాటించాలి
Published Fri, Apr 11 2014 3:27 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement