బిజినెస్ అనగానే సాధారణంగా పురుషులే గుర్తుకు వస్తారు. కానీ వ్యాపార రంగంలో మహిళలు కూడా తమదైన రీతిలో ముందుకు దూసుకెట్లున్నారన్న సంగతి చాలామంది విస్మరించి ఉండవచ్చు. మనం ఈ కథనంలో కోట్ల రూపాయల వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ మహిళల గురించి, వారు ఏం చదువుకున్నారు? ఏ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
సుధా మూర్తి (Sudhamurthy)
భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శప్రాయమైన 'సుధా మూర్తి' ప్రముఖ టెక్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్. ఈమె నారాయణ మూర్తిని వివాహం చేసుకోవడానికి ముందు బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో పద్మశ్రీ పొందిన ఈమె నికర సంపద విలువ సుమారు రూ. 775 కోట్లు అని సమాచారం.
రోష్ని నాడార్ (Roshni Nadar)
శివ నాడార్ కుమార్తె 'రోష్ని నాడార్' ప్రస్తుతం హెచ్‌సిఎల్ కంపెనీ సీఈఓ. ఈమె వసంత్ వ్యాలీ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తరువాత నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ రేడియో/టీవీ/ఫిల్మ్ వంటి వాటి మీద దృష్టి సారించి కమ్యూనికేషన్‌లో ప్రావీణ్యం సంపాదించింది. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2022 నాటికి ఆమె నికర సంపద విలువ రూ. 84,330 కోట్లని సమాచారం.
నీతా అంబానీ (Nita Ambani)
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ భార్య 'నీతా అంబానీ' ముంబైలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఈమె ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్. 2022 నాటికి ఈమె సంపద విలువ రూ. 84,330 కోట్లు అని తెలుస్తోంది.
కిరణ్ మజుందార్-షా (Kiran Mazumdar-Shaw)
కిరణ్ మజుందార్-షా బయోకాన్ లిమిటెడ్ అండ్ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు & ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కూడా. ఈమె బెంగళూరు ఐఐఎం మాజీ చైర్మన్‌గా కూడా పనిచేసింది. మజుందార్-షా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తరువాత బెంగుళూరు యూనివర్శిటీలో జువాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఈమె నికర ఆస్తుల విలువ 18779 కోట్లు అని సమాచారం.
ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
స్మితా కృష్ణ-గోద్రెజ్ (Smita Crishna-Godrej)
నావల్ గోద్రెజ్ కుమార్తె అయిన స్మితా కృష్ణ-గోద్రెజ్ ముంబైలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసింది. ఈమె థియేటర్ యాక్టర్ విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఈమె సంపద విలువ సుమారు 2.9 బిలియన్ డాలర్లు.
ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. ఈ రంగంలోని వారికి తిరుగులేదండోయ్!
రేష్మా కేవల్రమణి (Reshma Kewalramani)
డాక్టరుగా జీవితం మొదలుపెట్టిన రేష్మా కేవల్రమణి తరువాత కాలంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్‌తో కొత్త శిఖరాలకు అధిరోహించింది. ఈమె అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి లిబరల్ ఆర్ట్స్/మెడికల్ సైన్స్‌లో ఏడేళ్ల కోర్సు చేసి ఆ తరువాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి జనరల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment