నేలకొండపల్లి పంచాయతీ కార్యాలయం
నేలకొండపల్లి : పంచాయతీలను బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం సర్పంచ్‌కు ఎన్నికయ్యే వ్యక్తి విధిగా పదో తరగతి ఉతీర్ణులై ఉండాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. పల్లెల అభివృద్ధికి పాలనా పరమైన అంశాలలో ఇతరులపై ఆధారపకుండా ఉండేందుకు ఈ నిబంధన దోహదం చేస్తుందని పాలకులు భావిస్తున్నారు. ఇందుకు గాను క్ష్రేత్ర స్థాయిలో అక్షరజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కాని ఈ విధా నం ప్రత్యేక్షమా, పరోక్షమా తెలియక నాయకులు, ప్రజలు సంగ్ధిదంలో ఉన్నారు. ఇదిలా ఉండగా మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహి ంచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
అంతుకు తగిన విధంగా అధికారులు సైతం పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి విద్యార్హతా లేకుండా సర్పంచ్‌కు పోటీ చేశారు. కాని ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో అభ్యార్థుల ఎంపిక కష్టంగా మారింది. గతంలో కొందరు సర్పంచులు నిరక్షరాస్యులు కావడంతో పాలనకు సంబంధించిన అంశాలపై ఇతరులపై ఆధారపడవలసి వచ్చేది. జిల్లాలోని పంచాయతీల్లో సగం మంది సంతకాలకే పరిమితమవుతున్నారు. అంతేకాక మండల పరిషత్ సమావేశాలో సమస్యలపై మాట్లాడలేని వారు కూడా ఉన్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పదో తరగతి పాసైన వారు కేవలం పది శాతం మంది మాత్రమే ఉండటంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిబంధనను ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి.
పదో తరగతి విధానం చాలా మంచిది..
చదువుకున్న వారికి సర్పంచ్‌గా ఎన్నుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ప్రభుత్వం పథకాలు అర్హలకు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. ఈ విధానం అమలైతే నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
-జెర్రిపోతుల అంజిని, యూత్, నేలకొండపల్లి
పది నిబంధనను స్వాగతిస్తున్నాం..
సర్పంచ్ ఎన్నికకు ప్రభుత్వం తీసుకున్న పది పాస్ నిబంధనను స్వాగతిస్తున్నాం. దీని వలన పాలనలో పారదర్శకత పెరుగుతుంది. కనీస విద్యార్హత నిర్ణయం చాలా మంచి పరినామంగా బావిస్తున్నాం. ఈ విధానంను వెంటనే అమలు చేయాలి.
– శీలం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు,నేలకొండపల్లి.
Comments
Please login to add a commentAdd a comment