తగిన ఉద్యోగం దొరకడం లేదా?
అర్హతలు ఉన్నా కొందరికి ఉద్యోగం దొరకడం దుర్లభం. దొరికినా అర్హతలకు, అనుభవానికి తగిన జీతం దొరకవు. ఆర్థిక ఇబ్బందులు, నిరాశా నిస్పృహలు వెన్నాడుతాయి. తరచు ఆరోగ్య సమస్యలు పీడిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి కొన్ని పరిహారాలు...
అరచేతిలో పట్టేంత పరిమాణంలో ఉన్న రాగిపాత్రలను తీసుకోండి. వాటిని శనగపిండితో తయారు చేసిన లడ్డూలతో నింపి, పాత్రలతో సహా ఆ లడ్డూలను ఐదుగురు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఈ పరిహారాన్ని ఆదివారం లేదా గురువారం ఆచరించడం మంచిది.ప్రతిరోజూ రుద్రగాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించండి. కొత్త ప్రయత్నం ఏదైనా ప్రారంభించే ముందు పూజలో పసుపు వినాయకుడి ముందు ఆకులు వక్కలు ఉంచి, నిర్విఘ్నంగా పని పూర్తికావాలని వేడుకుని, గణపతి మంత్రాన్ని 11 సార్లు జపించండి.
ప్రతి శనివారం మధ్యాహ్నం నల్ల నువ్వులు కలిపిన అన్నం ముద్దలను కాకులకు పెట్టండి. ఆదివారం సూర్యోదయ వేళ రాగి పాత్రలో బెల్లం కలిపిన పానకాన్ని సూర్యుడికి నివేదించి, ఆ పానకాన్ని చిన్నారులకు పంచిపెట్టండి.ప్రతినెలా పున్నమి, అమావాస్య రోజుల్లో కనీసం ముగ్గురు వికలాంగులకు భోజనం పెట్టండి. ప్రతి గురువారం ఆవులకు అరటిపండ్లు తినిపించండి రావిచెట్టు మొదట్లో ఆవనూనెతో దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదలో రెండు లవంగాలను వేసి, ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
– పన్యాల జగన్నాథ దాసు