
ఛత్తీస్ సీఎంగా రమణ్‌సింగ్ ప్రమాణం
రాయ్‌పూర్: వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 61 ఏళ్ల డాక్టర్ రమణ్‌సింగ్ వరుసగా మూడోసారి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ శేఖర్ దత్ ప్రమాణం చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ (గుజరాత్), శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ పరేకర్ (గోవా), ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్), ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే సింథియా (రాజ స్థాన్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు) హాజరయ్యారు.
అలాగే బీజేపీ నాయకులు హర్షవర్ధన్ సింగ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, అనంత్‌కుమార్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా తదితరులు విచ్చేశారు.