ఢిల్లీ: అనవసర చట్టాలను తొలగించి, న్యాయ వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు.
ఈ సదస్సుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందా గౌడ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు గైర్హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.