chief justices
-
ముగ్గురు జడ్జీలతో ప్రమాణం చేయించిన సీజేఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ, రాజస్తాన్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురు వారం సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రమాణం చేశారు. వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య పూర్తి స్థాయి 34కు చేరింది. సుప్రీంకోర్టు భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ వైవీ చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మసీహ్, గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ మెహతాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’లో ప్రకటించారు. వీరి పేర్లను కొలీజియం ఈ నెల 6న ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేస్తున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతా -
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
రిటైర్డు సీజేఐకి 6 నెలల ఉచిత వసతి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేని నివాస వసతిని కేంద్రం సమకూర్చనుంది. సుప్రీంకోర్టు జడ్జీలకు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఏడాదిపాటు 24 గంటల వ్యక్తిగత భద్రతా సౌకర్యం ఏర్పాటు చేయనుంది. వీరికి డ్రైవర్ సౌకర్యం, సెక్రటేరియల్ అసిస్టెంట్‌ను పొడిగించనుంది. న్యాయశాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సవరించిన నిబంధనలతో ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, లేదా న్యాయమూర్తులు విమానాశ్రయాల్లోని లాంజ్లలో ప్రోటోకాల్ ప్రకారం గౌరవమర్యాదలు అందుతాయి. వీరి వాహన డ్రైవర్‌కు ఇతర ఉద్యోగులకు మాదిరిగా పూర్తి వేతనం, ఇతర అలవెన్సులను సుప్రీంకోర్టు/హైకోర్టు నిధుల నుంచి చెల్లిస్తారు. వీరికి కేటాయించే సెక్రటేరియల్ అసిస్టెంట్ స్థాయి సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీసర్‌తో సమానంగా ఉంటుంది. రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి/ న్యాయమూర్తులకు వ్యక్తిగత భద్రతతోపాటు వీరి నివాసాలకు ఏడాదిపాటు పూర్తి స్థాయిలో భద్రత సమకూరుస్తారు. రిటైర్డు సీజేఐకి ఢిల్లీలో ఉచిత టైప్–7 భవన వసతిని పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆరు నెలలపాటు కల్పిస్తారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు సందర్భంగా సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. -
నాలుగు మెట్రోల్లో మహిళలే ప్రధాన న్యాయమూర్తులు
దేశంలో నాలుగు ప్రధాన నగరాలు.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై. ఈ నాలుగు చోట్లా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలే ఉన్నారు. మార్చి 31వ తేదీన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇందిరా బెనర్జీ నియమితులయ్యారు. దాంతో ఈ లాంఛనం పూర్తయినట్లయింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలా నాలుగు ప్రధాన నగరాల్లోను మహిళా ప్రధాన న్యాయమూర్తులే ఉండటం ఇదే మొదటిసారని అంటున్నారు. ఈ నాలుగు హైకోర్టులు కూడా స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్నవే. మద్రాసు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సహా మొత్తం ఆరుగురు మహిళా జడ్జిలున్నారు. మరో 53 మంది పురుష జడ్జీలు కూడా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువారైన జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ 13 నుంచి ఉన్నారు. ఇక్కడ 9 మంది మహిళా జడ్జీలుండగా 35 మంది మగ న్యాయమూర్తులు ఉన్నారు. బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మంజులా చెల్లూర్ ఉన్నారు. ఆమె గత సంవత్సరం ఆగస్టు 22న బాంబే హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే అత్యధికంగా 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉండగా 61 మంది పురుష న్యాయమూర్తులు ఉన్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా నిర్మల్ మాత్రే. ఇక్కడ మొత్తం నలుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉండగా 35 మంది పురుష న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మొత్తం 24 హైకోర్టులలో 632 మంది జడ్జీలు ఉండగా వారిలో 68 మంది మాత్రమే మహిళలు. అంటే 10.7% మాత్రమే. ఇక సుప్రీంకోర్టులో అయితే మొత్తం 28 మంది జడ్జీలుండగా కేవలం ఆర్.భానుమతి అనే ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి ఉండటం గమనార్హం. -
6 రాష్ట్రాల హైకోర్టుల్లో సీజేలు లేరు
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాల హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ ఒక నివేదికలో తెలిపింది. దీంతోపాటు మరో 478 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం ఆగస్టు ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, సిక్కిం, త్రిపుర హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులతోనే పనిచేస్తునట్లు తెలిపింది. దేశంలోని 24 హైకోర్టుల్లో మొత్తం 601 జడ్జిలు పనిచేస్తున్నారని, వాస్తవంగా ఈ సంఖ్య 1079గా ఉండాలని నివేదిక వెల్లడించింది. -
మూడు రాష్ట్రాలకు కొత్త సీజేలు
న్యూఢిల్లీ: ఛత్తీస్ గఢ్, త్రిపుర, రాజస్థాన్ లకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న టిన్ లియాతంగ్ వైపీ ని త్రిపురకు బదిలీ చేశారు. ఛత్తీస్ గఢ్ న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ కుమార్ గుప్తాను నియమించారు.ఛత్తీస్ గఢ్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నవీన్ సిన్హాను రాజస్థాన్ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వేద ప్రకాశ్ వైశ్ ను మేఘాలయకు,మద్రాసు సీజే సతీష్ కుమార్ అగ్నిహోత్రిని సిక్కింకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటన పేర్కొంది. వీరందరినీ మే23 లోపు బాధ్యతలు స్వీకరించవలసిందిగా రాష్ట్రపతి ఆదేశించారు.త్రిపుర మణిపూర్,మేఘాలయల్లో 2013లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇవి గౌహతి హైకోర్టు పరిధిలో ఉండేవి.అవస్థాపనా సౌకర్యాల అనంతరం మిజోరాం, నాగాలాండ్,అరుణాచల్ ప్రదేశ్ లలో హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నట్లు కూడాప్రకటన తెలిపింది. -
'దేశంలో న్యాయవ్యవస్థ మెరుగుపడాలి'
ఢిల్లీ: అనవసర చట్టాలను తొలగించి, న్యాయ వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కారించాలని సూచించారు. ఈ సదస్సుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందా గౌడ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సుకు గైర్హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు!
జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు! న్యూ ఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్‌ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్కే కౌల్‌ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు!
జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు! న్యూఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్‌ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్‌ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్కే కౌల్‌ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది.