మలేషియాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు గాల్లోనే ఒకదాంతో మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు.
రాయల్ మలేషియన్ నేవీ పరేడ్ కోసం మంగళవారం ఉదయం లుముత్ నేవల్ బేస్‌లో రిహాల్సల్ జరిగాయి. ఆ సమయంలో రెండు హెలికాఫ్టర్లు ఆకాశంలోనే ఢీ కొట్టాయి. ముక్కలైన శకలాలు కింద మైదానంలో పడిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. రెండు హెలికాఫ్టర్లలో పది మంది సిబ్బంది అక్కడికక్కడే చనిపోయినట్లు మలేషియా నేవీ ప్రకటించుకుంది. మృతదేహాల గుర్తింపునకు కోసం నేవీ ఆస్పత్రికి మృతదేహాల్ని తరలించినట్లు తెలిపింది.
⚡Ten people are reported killed as two military #helicopters had a mid-air collision in #Malaysia during preparations for a naval military parade.
— Shafek Koreshe (@shafeKoreshe) April 23, 2024
The incident occurred in the town of Lumut at around 9:30 am during a training to mark the 90th anniversary of the Royal… pic.twitter.com/OEF3SDNG6a
Comments
Please login to add a commentAdd a comment