
మలేసియాలో దుర్ఘటన
కౌలాలంపూర్: మలేసియా ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని 10 మంది చనిపోయారు. ఉత్తర పెరాక్ రాష్ట్రంలోని నేవీ కేంద్రం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వచ్చే నెలలో జరిగే నేవీ వార్షికోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా పదుల సంఖ్యలో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తున్నాయి.
ఆ సమయంలో ఒక హెలికాప్టర్ పక్కకు జరగడంతో దాని రెక్క పక్కనే వస్తున్న మరో హెలికాప్టర్ రోటార్‌ను తాకింది. దీంతో, రెండు హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలాయి. వాటిలో ఉన్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం పది మంది వైమానిక దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment