![Israel Steps Up Attacks in Southern Gaza as Negotiations Stumble - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/3/gaza.jpg.webp?itok=bhROVQ6p)
ఖాన్ యూనిస్: శనివారం దక్షిణ గాజాలోని నిర్దేశిత లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లో హెలికాప్టర్ల ద్వారా మొట్టమొదటిసారిగా మ్యాప్ ముద్రించిన కరపత్రాలను విడిచిపెట్టింది. అందులో, దాడుల నుంచి రక్షణ పొందేందుకు తాముంటున్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలిపే వివరాలున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాడుల్లో కనీసం 200 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలోని ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment