
'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం'
ఎన్నికల సమయంలో మావో ప్రభావిత ప్రాంతలలో హెలికాప్టర్లు వినియోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వెల్లడించారు. శనివారం ఆయన విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో భన్వర్లాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 457 భద్రత బలగాలు అవసరమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
కొత్తగా ఓటర్లు నమోదుకు సీమాంధ్రలో ఏప్రిల్ 8 వరకు గడువు విధించినట్లు చెప్పారు. గుర్తింపు కార్డు సమస్య వస్తే 9246280027కు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) చేయాలని ఆయన ఓటర్లకు సూచించారు.10 లక్షల మంది ఓటర్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని భన్వర్లాల్ తెలిపారు.