న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల డీల్లో అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వెస్ట్ ల్యాండ్తో డీల్ వ్యవహారం అనంతరం భారతీయ మీడియాతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అగస్టా వెస్ట్ ల్యాండ్ మధ్యవర్తికి ఆరు మిలియన్ పౌండ్లను ఇచ్చినట్లు తెలిసింది.
2010-2012 మధ్య కాలంలో హెలికాప్టర్ల కొనుగోలు గురించి ఎటువంటి దుష్ర్ఫచారం లేకుండా చేయడానికి అగస్టా కంపెనీ క్రిష్టియన్ మైఖేల్ అనే వ్యక్తి డబ్బును సమకూర్చింది. మొత్తం 3,546 వేల కోట్ల రూపాయల ఈ డీల్లో 12 అగస్టా వెస్ట్ల్యాండ్ 101 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందించేందుకు 2010లో ఒప్పందం జరిగింది.
స్కామ్తో సంబంధం ఉన్న మైఖేల్ను పట్టుకోవడానికి ఈడీ ఇంటర్పోల్కు ఫిబ్రవరి 4న లేఖను రాసింది. ప్రస్తుతం మైఖేల్ దుబాయ్లో ఉన్నట్లు కనుగొన్న ఈడీ, సీబీఐలు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాయి.
2013లో బయటపడిన ఈ స్కామ్లో దేశ కీలక రాజకీయ నేతలతో పాటు మిలటరీ అధికారులు అగస్టా వెస్ట్ ల్యాండ్కి 610మిలియన్ డాలర్లకు బిడ్ దక్కేలా చేసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్పై కుట్ర, మోసం, అవినీతికి మధ్యవర్తిత్వం నిర్వర్తించడం తదితర చట్టాలపై కేసులు నమోదు చేశారు.
హెలికాప్టర్ల అవినీతికి మధ్యవర్తి ఈయనే
Published Thu, Apr 28 2016 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement
Advertisement