యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిలో ఎవరిది పైచేయి అనేది కొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇరువురి అభ్యర్థుల ప్రచార వ్యూహం ఎలా ఉన్నా..వారి ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్ ఎంతవరకు ఓటర్లను ఆకర్షించింది?. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరువురు ఎలాంటి స్టైల్‌ని ఎంచుకున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా..!
ఫ్యాషన్ రాజకీయాలు వేర్వేరు అనుకుంటే పొరబాటే. ఈ రోజుల్లో నాయకుల ఫ్యాషన్ శైలి కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా మారింది. అమెరికాలో ఉత్కంఠభరితమైన అధ్యక్ష పోలింగ్ వేళ..ఇరువురు తమ ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్‌తో ఓటర్లను తమదైన పంథాలో ప్రభావితం చేసేలా యత్నించారు. ఆ నాయకులిద్దరూ తాము ధరించే దుస్తులతో తాము ప్రజల మనిషి అని పరోక్షంగా తెలియజేశారు. వారి భావజాలంతో కంటే తమ ఫ్యాషన్‌శైలితోనే ఓటర్లకు కనెక్ట్ అయ్యారు. అదెలాగో సవివరంగా చూద్దామా..!.
కమలా హారిస్ క్లాసిక్ అండ్ టైలర్డ్ స్టైల్..
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ చాలా కాలంగా సిగ్నేచర్ సిల్హౌట్ ఫ్యాషన్‌కి కట్టుబడి ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసేలా శక్తిమంతమైన సూట్‌లు, ఫ్యాంట్‌లు ఎంపిక చేసుకుంది. టైలర్డ్ ప్యాంట్‌సూట్‌లతో ప్రజలకు మరింత చేరవయ్యింది.
అంతేగాదు ఆమె ధరించి షోల్డర్ ప్యాడ్‌లు ఓటర్లకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. స్థిరత్వమైన నిర్ణయాలకు ప్రతీక అని చాటి చెప్పేలా కమలా ఆహార్యం ఉంటుంది. అలాగే కమలా ధరించే సూట్‌కి పిన్ చేసి ఉన్న ఫ్లాగ్ ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముఖ్యంగా ఆమె ధరించే ముత్యాలకు సంబంధించిన టూ-స్ట్రాండ్ ఐరీన్ న్యూవిర్త్ నెక్లెస్ ప్రశాంతతకు పెద్దపీట వేసే మనిషి అని చెప్పకనే చెబుతోంది.
డొనాల్డ్ ట్రంప్ బోల్డ్ అండ్ బ్రష్ ఎంపికలు..
డొనాల్డ్ ట్రంప్ ధైర్యసాహసాలను చూపించేలా డార్క్ కలర్ బ్లూ సూట్‌లను, ఎరుపు టైని ధరిస్తారు. ఆ ఆహార్యంతో డొనాల్డ్ తరుచుగా నెట్టింట వైరల్ అవుతుంటారు కూడా. పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో బూడిదరంగు మెక్‌డొనాల్డ్ ఆప్రాన్‌తో ఆకట్టుకున్నారు. విస్కాన్సిన్‌లో అతని ఫ్లోరోసెంట్-నారింజ ట్రాష్ ప్రజల సమస్యకు సత్వరమే స్పందించే వ్యక్తిగా ప్రతిబింబించింది.
ఈ ఇద్దరు నాయకుల వార్డ్‌రోబ్‌లు మాటలతో పనిలేకుండా వారేంటి అనేది ప్రజలకు పరోక్షంగా తెలియజేశాయి. తమదైన భావజాలం, ఆహార్యంతో ఓటర్లకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నం చేశారు ఇరువురు. మరి ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..!
(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!)
Comments
Please login to add a commentAdd a comment