దుబాయ్‌లో కొత్త పెళ్లికొడుకు ఇల్లు ఎలా ఉందో చూశారా? | A Walk Through Rs 640 Crore Dubai Villa Of Anant Ambani, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Anant Ambani Dubai Villa: దుబాయ్‌లో అనంత్‌ లగ్జరీ విల్లా.. పెళ్లికి ముందే నాన్న ఇచ్చిన గిఫ్ట్‌

Published Sun, Jul 14 2024 12:46 PM | Last Updated on Sun, Jul 14 2024 1:55 PM

A walk through rs 640 crore Dubai villa of Anant Ambani

ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చెంట్‌ల వివాహం ముంబైలో అంత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ సినీ ప్రముఖులు తరలిరాగా ప్రపంచం అబ్బురపడేలా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి.

విస్తారమైన వ్యాపార సామ్రాజ్యానికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్‌ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయ్‌లో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి గిఫ్ట్‌ ఇచ్చిన సంగతి తెలుసా..? ఆ విలాసవంతమైన ఇంటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

అనంత్ అంబానీకి దుబాయ్‌లోని పామ్ జుమేరాలో సముద్రతీరంలో అత్యంత ఖరీదైన, విశాలమైన విల్లా ఉంది. ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారు రూ.640 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అనంత్‌ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇందులో పది బెడ్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి. ఇది దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement