చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌: రూ.640 కోట్ల దుబాయ్‌ లగ్జరీ విల్లా | Nita Ambani's Wedding Gift To 'Choti Bahu' Radhika Is A Rs. 640 Crores Villa In Dubai, Pics Inside | Sakshi
Sakshi News home page

చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్‌ గిఫ్ట్‌ : రూ.640 కోట్ల దుబాయ్‌ లగ్జరీ విల్లా

Published Sat, May 25 2024 1:20 PM | Last Updated on Sat, May 25 2024 5:28 PM

Nita Ambani's Wedding Gift To 'Choti Bahu' Radhika Is A Rs. 640 Crores Villa In Dubai, Pics Inside

అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  ముఖేశ్‌, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా  అనేక ఖరీదైన బహుమతులను అందించారు. తాజాగా నీతా అంబానీ  కాబోయే చిన్న కోడలికి దుబాయ్‌లోని అద్భుతమైన లగ్జరీ విల్లాను బహుమతిగా అందించ నున్నట్టు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, ఎన్‌ఎంఏసీసీ అధ్యక్షురాలిగా ఉన్న  నీతా అంబానీ దుబాయ్‌లో 640 కోట్ల విల్లాను కానున్నకొత్త కోడలికి గిఫ్ట్‌గా అందించనున్నారు. ఇందుల 10 విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు హైలైట్‌గా ఉంటాయిట. ఇంకా ఇందులో 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది.  అంతేకాదు  బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేసేందుకు  కూడా ఇది సరిపోతుందని అంచనా.

లవ్‌బర్డ్స్‌  అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌  తమ ప్రేమను అధికారికంగా ప్రకటించి, 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల గుజరాత్‌లో జామ్‌ నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. హస్తాక్షర్‌ వేడుకలో తమ ప్రేమపై సంతకాలుకూడా చేశారు. అటు రెండో విడత వేడుకలకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఏడడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

కాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా  అనంత్‌కు ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ గా అందించారు ముఖేష్‌ అంబానీ. అలాగే  కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కలశాలు  సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement