
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్, నీతా అంబానీల చిన్నకుమారుడు అనంత్ అంబానీ త్వరలోనేపెళ్లి పీటలెక్కబోతున్నాడు. వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో ఇటీవల గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇటీవల (ఏప్రిల్ 10న) అనంత్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లో బర్త్‌డే బాష్‌లో సందడి చేశాడు. బి-టౌన్ ప్రముఖులతోపాటు, సెలబ్రిటీలందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. పరిచయం అవసరంలేని పాపులర్ సెలబ్రిటీ కపుల్ ( రాధిక, అనంత్) అడోరబుల్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఒక ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. అంబానీ, టాటా, బిర్లా వీళ్లంతా ఎలా కుబేరులయ్యారు? ఈ సీక్రెట్ మిల్ గయా అనే క్యాప్షన్‌తో ఈవీడియోపోస్ట్ చేయడంతో ఇంటర్నెట్‌లో ఇది హల్‌చల్ చేస్తోంది. ఇక వీడియో విషయానికి వస్తే మన ఐల్యాష్ (కను రెప్ప వెంట్రుక) తీసి ఊదితే కోరుకున్నది జరుగుతుందనీ, అదృష్టం కలిసివస్తుందనేది ఒక నమ్మకం. అలా రాధిక మర్చంట్ అనంత్ ఐల్యాష్ తీయడం, దానిని అనంత్ ఊదడం ఈ వీడియోలో చూడవచ్చు. దీనిపై చమత్కారంగా అలా క్యాప్షన్ ఇచ్చారన్నమాట. మాకు రాదేంటి ఇలాంటి అదృష్టం అని కొందరు, జోక్స్ పక్కన పెడితే జంట ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ మరికొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం
కాగా 28 ఏళ్లు నిండిన అనంత్ "AMA 28" అనే టైటిల్‌తో ఘనంగా జరుపుకున్న పుట్టిన రోజువేడుకలు, రాధిక మర్చంట్, అనంత్ అంబానీ ఫోటోలు, ఓర్హాన్ అవత్రమణితో రాధిక దుబాయ్‌లో స్కైడైవింగ్ సందడి లాంటివి ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment