
పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి సాగనంపడం అనేది భావోద్వేగంతో కూడిన సందర్భం. పెళ్లికి నిశ్చితార్థం మొదలు, ఆ మూడు ముళ్లూ పడివరకు, ఇక అమ్మాయి అప్పగింతల సమయంలో ఆ ఉద్విగ్న క్షణాలు కన్నీటి పర్వంత మవుతాయి. నిరుపేదైనా, కుబేరుడైనా ఈ అనుభవం తప్పదు.
పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ ముద్దుల తనయ రాధికమర్చంట్ మధ్య ఇలాంటి భావోద్వేగ క్షణాలు నమోదైనాయి. మర్చంట్, అంబానీ కుటుంబాలు నిర్వహించిన గ్రహ శాంతి పూజ సందర్భంగా వీరేన్, కాబోయే వధువు రాధికను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందు అనంత్ అంబానీకూడా తన కాబోయే భార్యను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఇద్దరు పారిశ్రామికవేత్తలువియ్యమందుకునే ముహూర్తం మరికొద్ది గంటల్లో రానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో ఈ రోజు (జూలై 12) వివాహం జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు ఇప్పటికే ముంబై చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment