అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్‌ టైకూన్స్‌ | Ambani wedding business tycoons likely to grace event | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్‌ టైకూన్స్‌

Published Fri, Jul 12 2024 8:54 PM | Last Updated on Sat, Jul 13 2024 9:06 AM

Ambani wedding business tycoons likely to grace event

Ambani wedding: ఎంతగానో ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలు శుక్రవారం (జూలై 12) సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నుంచి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ వరకు అనేక మంది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రముఖలులు ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరవుతున్న వ్యాపార దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, థాయ్ వ్యాపారవేత్త, అంతర్జాతీయ ఒలింపిక్ సభ్యురాలు ఖున్ యింగ్ పటామా లీస్వాడ్ట్రాకుల్, సౌదీ అరామ్‌కో సీఈవో అమీన్ నాసర్, బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముర్రే ఔచిన్‌క్లోస్ ఉన్నారు. అలాగే డ్రగ్ దిగ్గజం జీఎస్‌కే సీఈవో ఎమ్మా వామ్‌స్లీ, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో కూడా వేడుకలకు హాజరవుతున్నట్లు ఎకానమిక్‌ టైమ్స్‌ నివేదించింది.

వీరితో పాటు ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ , టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే, హెచ్‌పీ ప్రెసిడెంట్ ఎన్రిక్ లోరెస్, ఏడీఐఏ బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలతీ, ముబాదలాకు చెందిన ఖల్దూన్ అల్ ముబారక్, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఎండీ బాదర్ మహ్మద్ అల్-సాద్ తదితరులు వేడుకలకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement