BUSINESS PEOPLE
-
Padma awards 2025: పారిశ్రామిక పద్మాలు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.ఒసాము సుజుకీ1930 జనవరి 30న జపాన్‌లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.నల్లి కుప్పుస్వామి చెట్టితమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పంకజ్ పటేల్1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్‌కేర్‌లో (ప్రస్తుతం జైడస్ లైఫ్‌సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్‌ఫ్రీ, ఎవర్‌యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్‌లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్‌లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 24 ర్యాంకులో నిలిచారు.అరుంధతీ భట్టాచార్య సేల్స్‌ఫోర్స్ ఇండియా చైర్పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2013లో ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు. -
రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..
భారతదేశంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాదిరిగానే.. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నుడు 'షాహిద్ ఖాన్' (Shahid Khan). బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ జాక్సన్విల్లే జాగ్వార్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఫుల్హామ్ ఎఫ్‌సీ వంటి వాటిని సొంతం చేసుకుని బాగా ఫేమస్ అయ్యారు. ఈయన కుమారుడు టోనీ ఖాన్, కుమార్తె షన్నా ఖాన్. కొడుకు తండ్రి బాటలో నడుస్తుంటే.. కుమార్తె మాత్రం దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.షన్నా ఖాన్ (Shanna Khan) అమెరికాలోని ఇల్లినాయిస్లో.. సోదరుడు టోనీతో కలిసి పెరిగింది. ఈమె ప్రత్యేకమైన ప్యాకేజింగ్ డిజైన్ ఆర్గనైజేషన్ 'యునైటెడ్ మార్కెటింగ్ కంపెనీ'ని కూడా నిర్వహిస్తోంది. అటు వ్యాపారం, ఇటు సామజిక సేవ రెండింటిలోనూ తన నిబద్ధతను చాటుకుంటోంది.షన్నా ఖాన్.. జాగ్వార్స్ ఫౌండేషన్ ద్వారా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటుంది. ఈమె తన కుటుంబంతో కలిసి గత ఏడాది యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ వెటర్నరీ టీచింగ్ హాస్పిటల్‌కు ఏకంగా రూ.123 కోట్లు విరాళంగా అందించింది. ఇది యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.పక్కన వాళ్లకు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వ్యక్తులున్న ఈ రోజుల్లో ఏకంగా రూ. 123కోట్లు దానం చేశారంటే.. వారి ఉదారత అనన్య సామాన్యం. దీన్ని బట్టి చూస్తే వారి దాతృత్వం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.ఇదీ చదవండి: 300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్షన్నా ఖాన్.. వోల్ఫ్ పాయింట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'జస్టిన్ మెక్‌కేబ్'ను వివాహం చేసుకుంది. ఈమె ఆస్తుల విలువ 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈమె షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ లక్ష కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. షన్నా ఖాన్ నికర విలువ, విరాళాలు మొత్తం కలిపినా అంబానీ ఫ్యామిలీ అంత ఉండకపోయినా.. ఉదారంగా విరాళాలు అందించడంలో వీరికి వీరే సాటి. -
అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్ టైకూన్స్
Ambani wedding: ఎంతగానో ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకలు శుక్రవారం (జూలై 12) సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నుంచి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ వరకు అనేక మంది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రముఖలులు ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరవుతున్న వ్యాపార దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, థాయ్ వ్యాపారవేత్త, అంతర్జాతీయ ఒలింపిక్ సభ్యురాలు ఖున్ యింగ్ పటామా లీస్వాడ్ట్రాకుల్, సౌదీ అరామ్కో సీఈవో అమీన్ నాసర్, బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముర్రే ఔచిన్క్లోస్ ఉన్నారు. అలాగే డ్రగ్ దిగ్గజం జీఎస్కే సీఈవో ఎమ్మా వామ్స్లీ, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో కూడా వేడుకలకు హాజరవుతున్నట్లు ఎకానమిక్ టైమ్స్ నివేదించింది.వీరితో పాటు ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ , టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే, హెచ్‌పీ ప్రెసిడెంట్ ఎన్రిక్ లోరెస్, ఏడీఐఏ బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలతీ, ముబాదలాకు చెందిన ఖల్దూన్ అల్ ముబారక్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ బాదర్ మహ్మద్ అల్-సాద్ తదితరులు వేడుకలకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. -
అనంత్, రాధికల పెళ్లి అక్కడే.. 29 నుంచే సంబరాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29న అంబానీల ముంబై నివాసం యాంటిలియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ కొత్త జంట మరికొన్ని రోజుల్లోనే పెళ్లిపీటలెక్కనున్నారు.జూన్ 29న యాంటిలియాలో పూజా కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 2023 జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు అతిధులుగా హాజరుకానున్నారు. మార్చిలో మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో, రెండో సారి క్రూయిజ్ షిప్లో జరిగాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
జీఎస్టీ గుబులు
భీమవరం/తాడేపలి్లగూడెం : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపార వర్గాల్లో సెగ పుట్టిస్తోంది. జూలై 1నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపులు, మరికొన్ని వస్తువులకు శ్లాబ్ రేట్లు పెంచనున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు పన్నుల ద్వారా లభించే ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీపై జిల్లాలోని అన్నిరకాల వ్యాపారులకు అవగాహన కల్పించే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ధాన్యం, బియ్యం, గోధుమలు, వాటితో చేసే ఉత్పత్తులు, అపరాలు, పప్పులు, అగరుబత్తి, స్కూల్ బ్యాగ్‌లు, ప్యాకేజ్డ్ ఆహారం వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహా యింపు ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ చేతి పనిముట్లు, దివ్యాంగులు వినియోగించే వస్తువులు, ఆక్వా, పౌల్ట్రీ ఫీడ్, తమలపాకులు, బార్లీ, తృణ ధాన్యాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలు, వంట చెరకు, కూరగాయలు, మరమరాలు వంటి వాటికీ మినహాయింపు లభించనుంది. మిర్చి, పత్తి, కాఫీ, టీ, ఖనిజాలు తదితర వస్తువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నులే జీఎస్టీలో కొనసాగుతాయని సమాచారం. జీఎస్టీ అమల్లోకి వస్తే స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో వస్తు ఉత్పాదక వ్యయం తగ్గి స్థానికంగా తయారయ్యే వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్యకలాపాలు ఆన్లైన్ జీఎస్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఈ చట్టం కింద వ్యాపారులు దాఖలు చేసే రిటర్న్స్, చెల్లించే పన్నుల ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారు. దీనివల్ల వ్యాపార కార్యాకలాపాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు, వ్యాపారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఒకే రకమైన పన్ను అమలు కావడం వల్ల పన్ను చెల్లించాలి్సన అవసరం నేరుగా వినియోగదారులకు ఉండదు. ఏకీకృత పన్నుల వ్యవస్థ వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. చిన్న వ్యాపార సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. పన్ను వసూలు సులభతరమై బకాయిలు, చట్టపరమైన వివాదాలు తగ్గుతాయనేది అధికారుల భావన. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సరుకులపై కూడా ఇన్పుట్ టాక్స్‌లు పొందేందుకు వ్యాపారులకు అర్హత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాట్ చట్టం ప్రకారం నిల్వ ఉన్న ఇన్పుట్ టాక్స్‌ను జీఎస్టీ చట్టం అమలు తరువాత తిరిగి పొందవచ్చు. ఇప్పటికే 90 శాతానికి పైగా వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చారు. విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు, సేవలపై కట్టిన పన్ను వాపస్ ఇస్తారు. అదనంగా లేదా పొరపాటున చెల్లించిన పన్నును కూడా వ్యాపారులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే నడుస్తుంది. అనుమానాలెన్నో.. జీఎస్టీ విధానంపై వ్యాపారులను అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. తమ అనుమానాలను అవగాహన సదస్సుల్లో అడుగుతుంటే. అధికారులు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సాగుతున్న జీరో వ్యాపారాన్ని అధికారులు జీఎస్టీ ద్వారా ఏవిధంగా నియంత్రిస్తారన్నది అర్థం కాని సమస్యగా ఉంది. ఇప్పటికీ అనేక వ్యాపార సంస్థల్లో వ్యాట్‌లో నమోదు చేయని సరుకుల నిల్వలు భారీగా ఉన్నాయి. జూలై 1నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే వాటిని ఏ విధంగా చూపిం చాలనే సందేహం వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పన్నుల శ్లాబులు జీఎస్టీ వల్ల మారనున్నాయి. అదనంగా పెరిగే పన్నులను ఏవిధంగా చెల్లించాలనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటివరకు మామూళ్లకు అలవాటు పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ అమలైతే తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు. జీఎస్టీ నాలుగు రకాలు జీఎస్టీ విధానంలో నాలుగు రకాలు ఉంటాయని చెబుతున్నారు. సీజీఎస్టీ (సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ) ఎస్జీఎస్టీ (స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ ) యూజీఎస్టీ (కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ) ఐజీఎస్టీ (ఇంటర్ స్టేట్ జీఎస్టీ)గా వీటిని పిలుస్తారు. ఈ నాలుగింటిలో ఐజీఎస్టీ ఆదాయం కేంద్రం వద్దే ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో తయారైన వస్తువు ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించగా వచ్చే పన్నును ఏ దామాషాలో అక్కడి తయారీదారుకు, ఇక్కడి విక్రేతకు విధించాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. మిగిలిన మూడు రకాల పన్నులను మార్గదర్శకాలకు అనుగుణంగా విధిస్తారు. రివర్స్ చార్జి మెకానిజం జీఎస్టీ లావాదేవీలన్నీ ఈ–ఇన్పుట్ ద్వారా సాగించాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నిరకాల ఆవర్జా పుస్తకాలు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమ్మకాలు, కొనుగోలు విషయాలకు సంబంధించి పన్ను రాయితీకి కొన్ని విధివిధానాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఒక రిటైల్ వ్యాపారి హోల్‌సేల్ వ్యాపారి నుంచి రూ.5 లక్షల విలువైన సరుకును కొనుగోలు చేస్తే.. అది హోల్‌సేల్ వ్యాపారి అమ్మకాల్లోకి వెళ్లి రూ.5 లక్షల అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పన్ను చెల్లింపుల్లోకి వెళుతుంది. రిటైల్ వ్యాపారి రూ.లక్ష విలువైన సరుకును వెనక్కి ఇస్తే ఎలక్ట్రానిక్ ఇన్పుట్లో ఆ విషయాన్ని పొందుపరిస్తే.. ఆ మేరకు జీఎస్టీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రివర్స్ చార్జ్ మెకానిజమ్‌గా ఈ లావాదేవీలను చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీగా అత్యధికంగా 20 శాతం పన్ను విధించవచ్చు. ఎస్జీఎస్టీగా కూడా 20 శాతం పన్ను వేయవచ్చు. ఐజీఎస్టీగా మాత్రం అత్యధికంగా 40 శాతం పన్ను వసూలు చేయవచ్చని సమాచారం. జీఎస్టీపై దఫదఫాలుగా వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు, ఉద్యోగులకు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. అప్పటికి గాని జీఎస్టీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
అమ్మో.. జీఎస్టీ!
తాడేపల్లిగూడెం : ‘జీఎస్టీ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది.. పన్నులు ఎలా ఉంటాయో.. డబ్బు చలామణి కుదరదంటావా.. అనామతు ఖాతాలు ఉండవటగా.. నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే చేసి తీరాలా..’ వ్యాపారుల మధ్య నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణలివి. ఇకపై చిట్టా, ఆవర్జాలు ఎలా నిర్వహించాలి, అసలు జీఎస్టీ ఎలా ఉండబోతోందనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. మొత్తంగా గూడ్స్, సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంశం వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీని అమలుకు అమలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రేపోమాపో మార్గదర్శకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారుల్లో గుబులు నెలకొంది. జీఎస్టీ ఆమల్లోకి వస్తే రోజుకు రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించకూడదు. అంతకుమించి లావాదేవీలు చేయాల్సి వస్తే బ్యాంక్ ఖాతాలు, ఆన్లైన్ ఆర్టీజీఎస్ ద్వారా మాత్ర మే చెల్లింపులు చేయాలి. ఇంత చేసినా మామూళ్ల బెడద తప్పుతుందా లేదా అనే మీమాంస నెలకొంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఒకటి, కేంద్ర ప్రభుత్వం అధీనంలో మరొకటి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటవుతాయని చెబుతున్నారు. దీనివల్ల రెండుచోట్లా మామూ ళ్లు సమర్పించుకోవాల్సి వస్తుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. రూ.కోటిన్నర టర్నోవర్ ఉండే వ్యాపారాలపై రాష్ట్రం అజమాయిషీ. రూ.కోటిన్నర దాటితే కేంద్రం ఆజమాయిషీ ఉంటుందని చెబుతున్నారు. నగదు లావాదేవీలు ఇలా.. ఆర్థిక బిల్లు–2017లో చేసిన సవరణల వల్ల వ్యాపార వర్గాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. గతంలో రోజుకు రూ.20 వేలకు మించి నగదు రూపంలో చెల్లించకూడదనే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు తగ్గించారు. అంటే ఏప్రిల్ 1నుంచి అద్దెలు, జీతాలు, నగదు కొనుగోళ్లు మొదలైనవి రోజుకు రూ.10 వేలకు మించి ఖర్చు చేయకూడదు. రవాణాదారులు మాత్రం గతంలో మాదిరిగానే రోజుకు రూ.35 వేలు నగదు రూపంలో చెల్లింపులు చేయవచ్చు. గతంలో మూలధన ఖర్చు నగదు రూపంలో ఎంతైనా చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం రూ.10 వేలకు మించి చేసే మూలధన ఖర్చుకు తరుగుదల అనుమతించరు. గతంలో వ్యాపార నిమిత్తం కారు, జనరేటర్, ఏసీ మొదలైనవి నేరుగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేసినా తరుగుదల అనుమతించేవారు. నూతన సవరణ ప్రకారం చెక్కు, ఎలక్ట్రానిక్ ట్రా¯Œ్సఫర్ ద్వారా చేసే చెల్లింపులను మాత్రమే తరుగుదలకు అనుమతిస్తారు. నగదు రూపంలో రూ.2 లక్షల తీసుకోవడంపై వ్యాపార వర్గాల్లో ఆందోళన ఉంది. రోజుకు ఒక వ్యక్తి నుంచి నగదురూపంలో తీసుకునే మొత్తం రూ.2 లక్షలు దాటకూడదు. ఒక లావాదేవీ విలువ రూ.2 లక్షలు దాటితే నగదు రూపంలో తీసుకోకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం లేదా సందర్భం విషయంలో రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లింపులు చేయడం కుదరదు. బ్యాంకు ఖాతాలో ఎంత సొమ్ము అయినా జమ చేయవచ్చు, తీసుకోవచ్చు. అయితే.. రూ.2 లక్షలకు మించి నగదుగా తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ ఆ మొత్తంపై 100 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆందోళన వద్దు జీఎస్టీ వసూలు విధానం, రూ.2 లక్షల నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు అపోహలు పెట్టుకోవాలి్సన అవసరం లేదు. చట్టంలో ఈ విషయాలను పూర్తిగా పొందుపర్చారు. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మంచిది. – ఎన్వీ రమణారావు, ఇన్‌కం ట్యాక్స్ ఆడిటర్ -
క్రియేటీవ్ కార్డ్స్
విజిటింగ్ కార్డేనని తేలికగా తీసిపారేయకండలా.. అంటున్నారు బిజినెస్ పీపుల్. విజిటింగ్ కార్డును.. క్రెడిట్ కార్డంత జాగ్రత్తగా చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కామన్‌మ్యాన్ నాడి పట్టేయాలంటే కాస్త వెరైటీ ఉండాలని ఫిక్సయిన వ్యాపారవేత్తలు.. ఆ విజిటింగ్ కార్డునే తమ వ్యాపారాభివృద్ధికి బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. కార్డ్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేసి బిజినెస్ కార్డుగా మార్చి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. కరాటే మాస్టర్ విజిటింగ్ కార్డ్ ఇది. ఒక్క దెబ్బతో ఇటుకలు విరిచేయడం వీరికి మామూలే. తన కెరీర్‌కు ప్లస్ అయ్యే విధంగా విజిటింగ్ కార్డుకు ఈ రూపాన్నిచ్చాడాయన. ఇటుకలా కనిపిస్తున్న ఈ కార్డ్‌ను మధ్యలోకి విరిచేయవచ్చు. మళ్లీ ఒక్కటిగా చేర్చవచ్చు. ఈ డిఫరెంట్ కార్డ్ చూస్తే ఎవరైనా ఆయనకు శిష్యులుగా మారిపోవాల్సిందే. ఏమంటారు ! బిజినెస్ పీపుల్‌కు పరిచయాలు చాలా అవసరం. అందుకే వినియోగదారులు వచ్చే ఏ దారినీ వాళ్లు వదిలిపెట్టరు. తమ ప్రొఫెషన్ని విజిటింగ్ కార్డుతో పరిచయం చేయడం సహజమే. ఆ కార్డు ఆకారం చూడగానే వాళ్లు చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసుకునేలా డిజైన్ చేయించుకోవడం సిటీలో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. వీటిని మామూలు కార్డుల్లా అలా చూసి ఇలా పారేయకుండా.. ‘ఎంత వెరైటీగా ఉన్నాయో..!’ అని దాచుకునేలా ఉంటున్నాయి. ఏదైనా పని పడితే సదరు వ్యక్తి వెరైటీ కార్డున్న సంస్థను సంప్రదించే అవకాశమూ బోలెడుంది. ఈ డిఫరెంట్ బిజినెస్ కార్డుల వ్యాపార రహస్యం కూడా అదే. కస్టమర్‌ను దువ్వాలిగా.. ఓ హెయిర్ స్టైలిస్ట్ తన బిజినెస్ కార్డు.. దువ్వెన ఆకారంలో డిజైన్ చేయించాడు. ఆ కార్డును తాకినప్పుడల్లా సంగీతం కూడా వినిపిస్తుంటుంది. కస్టమర్‌ను ఎలా దువ్వాలో తెలిసిన సదరు వ్యాపారి.. తన కార్డుకు ఇలా దువ్వెన రూపమిచ్చాడు. సింకు గొట్టానికి అడ్డుపడిన చెత్తను తొలగించేందుకు ఉపయోగపడే ప్లంబర్ కూడా కార్డే. ప్లంబర్‌తో పని పడినప్పుడు వీటి మీదున్న నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. కొబ్బరి, క్యారెట్లు తురుముకోవడానికి అనువుగా ఓ బిజినెస్ కార్డుంది. చీజ్ స్టోర్స్ వ్యాపారి మెటల్‌తో ఈ బిజినెస్ కార్డు తయారు చేయించుకున్నాడు. ఓ ఫ్యాషన్ డిజైనర్ అయితే ఏకంగా డెనిమ్ క్లాత్‌తోనే తన బిజినెస్ కార్డుకు రూపాన్నిచ్చాడు. పానా కమ్ కార్డు ఓ బైక్ మెకానిక్ తన బిజినెస్ కార్డును చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. తన విజిటింగ్ కార్డు కస్టమర్లకు కనీస అవసరాలు తీర్చేదై ఉండాలనుకున్నాడు. ఈ బిజినెస్ కార్డుతో మెకానిక్ షాప్ అడ్రస్ తెలుసుకోవడమే కాదు.. బైక్ నట్లు కూడా బిగించుకోవచ్చు. మరికొన్ని బిజినెస్ కార్డులను ఆఫీస్ టెబుల్స్‌పై షో ఐటమ్స్‌గా వాడుకోవచ్చు. ఇలాంటి క్రియేటివిటీ ఉన్న బిజినెస్ కార్డులను చూసిన వారు ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. కాస్త ఖర్చుతో కూడుకున్నా.. తమ వ్యాపారానికి సాయమవుతోందని బిజినెస్ పీపుల్ ఈ కార్డులకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వైరైటీ కార్డులు మీరు చేయించుకోవాలనుకుంటే మీ ఆలోచనని గ్రాఫిక్ డిజైనర్కిచెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం. - విజయారెడ్డి బిజినెస్‌కి తగ్గట్లు ఎలాంటి కార్డులనయినా మేము తయారు చేస్తాము. మెటల్ కార్డులకయితే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మినిమమ్ 15 రూపాయల నుంచి మొదలై.. డిజైన్, క్వాంటిటీ బట్టి చార్జ్ పెరుగుతూ పోతుంది. బిజినెస్ కార్డుల విషయంలో ఒకప్పటిలా కాకుండా కస్టమర్లు చాలా క్రియేటివిటీ కోరుకుంటున్నారు. కార్డుని ఎవరికైనా ఇస్తే ఒక్కసారి చూసి పడేయకుండా ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటున్నారు -జి.వి.రమణ, గ్రాఫిక్ డిజైనర్స్ ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న ఓ కంపెనీకి చెందిన విజిటింగ్ కార్డ్. దీన్ని ఓపెన్ చేస్తే చాలు ఇలా కార్డ్‌లోనే వాళ్ల నిర్మాణ శైలి కనిపిస్తుంది. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఏఎంజీ కంపెనీ తన విజిటింగ్ కార్డ్‌ను ఇలా డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. మెటల్‌తో చేసిన ఈ కార్డు చాలా రిచ్‌గా ఉంది కదా ! ఇదో ఫ్యాషన్ డిజైనర్ విజిటింగ్ కార్డు. కొత్తపుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ రంగాన్ని ప్రతిబింబించే విధంగా విజిటింగ్ కార్డు ప్రిపేర్ చేశారు. -
పసుపు రైతు విలాపం
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : పసుపు ధర కొన్నేళ్లు బంగారంతో పోటీపడి రైతుల్లో ఆశలు చిగురింపజేసింది. నాలుగేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.17 వేలు పలికింది. చాలా మంది రైతులు ఈ పంటసాగువైపు మొగ్గు చూపారు. ఫలి తంగా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ, ఆనాటి ధరలు ఎప్పుడూ లభించడం లేదు సరికదా... రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. మరుసటి ఏడాది క్వింటాల్‌కు రూ.10 వేలు అనంతరం రూ.5 వేలకు పడిపోయాయి. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ధర పెరగకపోతుందా? అనే ఆశతో జిల్లాలోని చాలా మంది రైతులు పసుపులో తేమ లేకుండా చేసి, కోల్డ్స్టోరేజీలతోపాటు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అయినా వారికి ఫలితం దక్కేలా లేదు. సీజన్లో క్వింటాల్‌కు రూ.7 నుంచి రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.4 నుంచి రూ.6 వేల మధ్య కదలాడుతూ రైతులను నిరాశలో ముంచుతోంది. జిల్లాలో 70 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. ఒక్కో ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి అవుతోంది. కోళ్ల, పశువుల ఎరువు పోయించడంతోపాటు విత్తనాలు, కూలీల ఖర్చు పెరగడంతో పెట్టుబడి భారీగా పెరిగింది. జిల్లాలో గతేడాది అక్కడక్కడా పంటకు తెగుళ్లు సోకినప్పటికీ చాలా చోట్ల ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా (పచ్చి పసుపు) దిగుబడి వచ్చింది. పసుపును సుగంధ ద్రవ్యాల్లో, రంగుల పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, అంతర్జాతీయుంగా డిమాండ్ లేదనే సాకుతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. 3 లక్షల బస్తాల నిల్వలు సీజన్లో రేటు లేకపోవడంతో జిల్లాలోని రైతులు 3 లక్షల బస్తాల పసుపు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ఒక్కో బస్తా 80 కిలోల నుంచి క్వింటాల్ వరకు ఉంటుంది. పండిన పసుపు అమ్ముడుపోకపోవడంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండడంతో రబీ సీజన్‌కు సైతం మళ్లీ కొత్తగా అప్పు చేసే పరిస్థితి. పెద్ద రైతులే కాకుండా చిన్న రైతులు సైతం ధర పెరగకపోతుందా అని నిల్వ చేయడంతో చేతిలో డబ్బులు లేక నెట్టుకువస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్, సారంగాపూర్ మండలం అర్పపల్లి, రాయికల్ మండలం ఇటిక్యాల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, ధర్మారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో రైతుల వద్ద భారీగా పసుపు నిల్వలు ఉన్నాయి. రైతులకు తోడు వ్యాపారులు కూడా భారీగానే పసుపు ఉత్పత్తులు నిల్వ చేశారు. మరో రెండు నెలల్లో ఈ సీజన్లో వేసిన పసుపు పంట చేతికి అందే అవకాశం ఉండడంతో... గతేడాది పంట నిల్వ ఉన్న రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేరుగా మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని ఇరోడ్ మార్కెట్లో పసుపు విక్రయించుకుందామనుకున్నా ధర రూ.5 నుంచి రూ.6 వేల మధ్యలోనే ఉండడంతో ఏం చేయాలా? అని తలలు పట్టుకుంటున్నారు. పసుపు మద్దతు ధర పెంచాలని రైతులు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యలో కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ప్రయోజనం కలగడం లేదు.