అనంత్, రాధికల పెళ్లి అక్కడే.. 29 నుంచే సంబరాలు | Anant Ambani And Radhika Merchant's Wedding Starts June 29, Details Here | Sakshi
Sakshi News home page

అనంత్, రాధికల పెళ్లి అక్కడే.. 29 నుంచే సంబరాలు

Jun 18 2024 6:00 PM | Updated on Jun 18 2024 6:56 PM

Anant Ambani and Radhika Merchant Wedding Venue

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29న అంబానీల ముంబై నివాసం యాంటిలియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ కొత్త జంట మరికొన్ని రోజుల్లోనే పెళ్లిపీటలెక్కనున్నారు.

జూన్ 29న యాంటిలియాలో పూజా కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 2023 జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు అతిధులుగా హాజరుకానున్నారు. మార్చిలో మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో, రెండో సారి క్రూయిజ్ షిప్‌లో జరిగాయి.

జూలై 12న పెళ్లి
2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement