
రిలయన్స్ అధినేత, బిలియనీర్, ముఖేష్ అంబానీ , నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన లేడీ లవ్, రాధిక మర్చంట్‌తో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వైభంగా నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో మూడు మూళ్ల వేడుకను పూర్తి చేసేందుకు ఇరు కుటుంబాలు ప్రిపరేషన్స్ మొదలు పెట్టేసినట్టు తెలుస్తోంది.
అనంత్,రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 2024 తొలి వారంలో షురూ కానున్నాయి. అయితే ఎలాంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఆహ్వాన కార్డ్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు నీతా, ముఖేష్ అంబానీ స్వయంగా చేతితో రాసిన ఆహ్వానం ఒకటి నెటిజన్లను ఆకట్టు కుంటోంది. దీని ప్రకారంఈ వేడుకలు మార్చి ఒకటి నుంచి మూడు తేదీల మధ్య శుక్ర, శని, ఆదివారాల్లో మొదలు కానున్నాయి.
అనంత్ తన జీవితంలో కొత్త అడుగులు వేసేందుకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను ఎంచుకున్నామని వీరు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
కాగా రాధికా మర్చంట్ , అనంత్ అంబానీల నిశ్చితార్థ వేడుక గత ఏడాది జనవరిలో అంబానీ లగ్జరీ ఇల్లు యాంటిలియాలో ఘనంగా నిర్వహించారు. పురాతన గుజరాతీ సంప్రదాయాలు, గోల్ ధన చునారితో విశిష్ట అతిథుల మధ్య ఈ లవ్‌బర్డ్స్ ఇద్దరూ ఉంగరాలుమార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment